నాకు ఆరోగ్యం బాగోలేదని కొంతమంది సంబరపడుతున్నారట.డెవిల్ ఈజ్ బ్యాక్ ! ఇక జన సైనికుల అంతు తేలుస్తా అంటూ ఏపీ మంత్రి ఆర్కే రోజా( AP Minister RK Roja ) అన్నారు.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోజా ఇప్పుడు పూర్తిగా కోలుకుని మీడియా ముందుకు వచ్చారు.ఈ సందర్భంగా జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రపై రోజా తనదైన శైలిలో విమర్శలు చేశారు.పవన్ ఒకరోజు సీఎం అవ్వాలని అనుకుంటున్నాడు, మరోరోజు ఎమ్మెల్యే అవ్వాలని చెబుతారు అసలు ఎమ్మెల్యే కూడా కాలేనోడు ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కాదు అంటూ రోజా విమర్శించారు.
పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో అతనికే తెలీదు.ప్రజలకు ఏమి చేస్తావో చెప్పకుండా జగన్, వైసీపీ( Jagan, YCP ) నేతలపై చీప్ గా మాట్లాడుతున్నాడు అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికా లేక, అధికార పార్టీ నేతలను కొట్టడానికా అంటూ రోజా ప్రశ్నించారు.ఇక జనసేన వాహనానికి వారాహి అని అమ్మవారి పేరు పెట్టుకుని పవన్ బూతు పురాణం చెబుతున్నాడని మండిపడ్డారు.ప్రజల దృష్టిలో పవన్ విలన్ గా మారుతున్నాడని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) డైరెక్షన్ లోనే పవన్ ఈ విధంగా బూతులు మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు.చిరంజీవి చెప్పిన మాటలు పవన్ వింటే మంచిదని సూచించారు.
మీరు గుంపులుగా వచ్చినా, విడివిడిగా వచ్చినా, 2024 ఎన్నికల్లో గెలిచేది వైసిపినేనని, మళ్లీ జగన్ సీఎం అవుతారని, ఇది రాసి పెట్టుకోవాలంటూ రోజా సవాల్ విసిరారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలోనూ రోజా విమర్శలు చేస్తూ ఉంటారు .మాజీ మంత్రి పేర్ని నాని తరహాలనే రోజా కూడా జనసేన ,పవన్ కళ్యాణ్ పై మీడియా, సోషల్ మీడియా ద్వారా సెటైర్లు వేస్తూ, వైసీపీ తరఫున వాయిస్ వినిపిస్తూ ఉంటారు.అందుకే ఎక్కువగా జన సైనికులు రోజాను టార్గెట్ చేసుకొని మీడియా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తుంటారు.
ఈ కారణాలతోనే రోజా అనారోగ్యం నుంచి కోలుకున్న వెంటనే ఈ విధంగా జనసేనపై సెటైర్స్ మొదలుపెట్టారు.







