సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులలో కొందరు రొమాంటిక్ సీన్లలో చేయటానికి బాగా ఇష్టపడుతుంటారు.మరి కొంతమంది అటువంటి సీన్స్ లలో నటించకుండా కొన్ని రూల్స్ పెడుతూ ఉంటారు.
ఇప్పటికి కొంతమంది హీరోయిన్స్ లలో రొమాంటిక్ సీన్స్ లలో డీప్ గా నటించకుండా వచ్చారు.అందులో ఒకరు కీర్తి సురేష్( Keerthy Suresh ) అని చెప్పాలి.
కీర్తి సురేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకున్న ఈమె.2000 లో బాలనటిగా మొదటిసారి మలయాళం పైలెట్స్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.ఇక 2016లో నేను శైలజ సినిమా( nenu shileja movie ) ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమై తెలుగు ప్రేక్షకులను తన తొలి చూపులతోనే ఆకట్టుకుంది.

ఇక ఆమె నటించిన మహానటి సావిత్రి( Mahanati Savitri ) పాత్ర ఎంత ఆకట్టుకుందో చెప్పనవసరమే లేదు.ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో లీనమైపోయింది.ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి.ఇక మధ్యలో కొన్ని హిట్ కు అందుకోగా కొన్ని ఫ్లాప్స్ కూడా అందుకుంది.అయినా కూడా ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ఆ మధ్యనే దసరా( Dussehra ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఇక సర్కారు వారి పాట సినిమా సమయంలో గ్లామర్ షో కూడా పరిచయం చేసింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను, తన సినిమా అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.ఇప్పటివరకు కీర్తి సురేష్ లుక్ ఎంతో హోమ్లీగా ఉండేది.
ఇక ఈమధ్య హాట్ లుక్ తో, గ్లామర్ ఫోజ్ తో.నేను కూడా తక్కువేమికాదనట్లూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది.పైగా బాగా సన్నబడటంతో ఇంకాస్త రెచ్చిపోతుంది.

ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు చేయించుకుంటూ బాగా హడావుడి చేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే కీర్తి సురేష్ ఇప్పటివరకు చేసిన సినిమాలలో బాగా రొమాంటిక్ సీన్ లలో చేసినట్లు ఎక్కువగా కనిపించలేదు.ముఖ్యంగా లిప్ కిస్ సీన్స్ చేసినట్లు కూడా ఎప్పుడు అనిపించలేదు.
అయితే దానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.అదేంటే లిప్ లాక్ అనేది తన భర్తతో తప్ప ఏ హీరోతోనో అలా చేయనని.
అది ఏ సినిమాలో అయినా.ఎంత క్యారెక్టర్ డిమాండ్ చేసినా సరే ఆ పని చేయను అని నేరుగా చెప్పేస్తుందని తెలిసింది.
రీసెంట్ గానే కోలీవుడ్లో స్టార్ట్ డైరెక్టర్ కథ డిమాండ్ చేయడంతో కీర్తి సురేష్ ను లిప్ లాక్ సీన్స్ లో నటించమంటు అడిగారట.దీంతో కీర్తి తను ఈ సీన్ అసలు చేయనని ముఖం మీదే చెప్పేసిందట.
ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అవ్వటంతో జనాలు ఆమె మైండ్ సెట్ ని చూసి ఫీదా అవుతున్నారు.అదే వేరే హీరోయిన్స్ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ఓకే అంటారు అని అంటున్నారు.







