ఐపీఎల్ ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన బీసీసీఐ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మార్చి 26 నుంచి మే 29వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే.అయితే మరో 20 రోజుల్లో లీగ్ ప్రారంభం కానుండగా బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఝలక్ ఇచ్చింది.

 Bcci Huge Shock To Ipl Franchises With Fitness Program In National Cricket Acade-TeluguStop.com

అన్ని ఫ్రాంచైజీలు తమ ఇండియన్ ప్లేయర్లందరినీ నేషనల్ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయించాలని ఆదేశించింది.దీంతో ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే అలర్ట్ కావల్సి వస్తోంది.

త్వరలోనే జరగనున్న ఐపీఎల్ కోసం బెంగళూరు ఫెసిలిటీ సెంటర్ లో పది రోజుల ఫిట్నెస్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.అందుకే ప్లేయర్లను నేషనల్ అకాడమీ లో చేరాలని పిలుపునిచ్చింది.

నేషనల్ సెలక్షన్ కమిటీ సలహా నిమిత్తం ఈ ఫిట్నెస్ ప్రోగ్రాం కి శ్రీకారం చుట్టామని బీసీసీఐ తెలిపింది.

అయితే ప్రస్తుతం ఎవరైతే మొహాలీలో జరుగుతున్న టెస్టు ఫార్మాట్ లో ఆడుతున్నారో వారెవరూ కూడా నేషనల్ అకాడమీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు.

రంజీ ట్రోఫీలో ఆడే ప్లేయర్లు మూడో, ఫైనల్ రౌండ్ ముగిసిన తర్వాత ఫిట్నెస్ ప్రోగ్రాం లో జాయిన్ కావాల్సి ఉంటుంది.మార్చి 4 నుంచే అకాడమీలో రిపోర్ట్ చేయాలని బీసీసీఐ ఆదేశించింది.5వ తేదీ అంటే శనివారం నుంచి క్యాంపు షెడ్యూల్ ప్రారంభించింది బీసీసీఐ.

శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్ తదితర క్రికెటర్లు ఫిట్నెస్ సెంటర్ లో జాయిన్ కావాలని నేషనల్ క్రికెట్ అకాడమీ కోరింది.సూర్య కుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్ లు గాయాల కారణంగా ఇప్పటికే నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్, ఎన్సీఏ అధికారుల క్రికెటర్లందరికీ ఫిట్‌నెస్‌ పెంచడంలో సహాయం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube