భారత్ ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) కు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.ఈ మెగా టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ ను బీసీసీఐ ఖరారు చేసి ఐసీసీకి పంపించింది.
ఈ మెగా టోర్నీలో పాలుపంచుకునే ప్రపంచ మిగతా దేశాలకు కూడా ఈ షెడ్యూల్ పంపిస్తారు.ఆ ప్రపంచ దేశాల ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఫైనల్ షెడ్యూల్ రూపొందించడం జరుగుతుంది.
బీసీసీఐ తో పాటు టోర్నీలో పాల్గొనే మిగతా దేశాలు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించిన అనంతరం ఐసీసీ ఫైనల్ షెడ్యూల్ అధికారకంగా ప్రకటిస్తుంది.వన్డే వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 న ప్రారంభం అవ్వనున్న సంగతి తెలిసిందే.
బీసీసీఐ ఖరారు చేసిన డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న ఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్( England ), రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ తో ప్రారంభం అవ్వనుంది.

ఇక భారత జట్టు విషయానికి వస్తే అక్టోబర్ 8 చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆడనుంది.ఇక నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికీ ఎనిమిది జట్లు అర్హత సాధించాయి.
క్వాలిఫైయర్స్ ద్వారా మరో రెండు జట్లు అర్హత సాధించనున్నాయి.అయితే నవంబర్ 15, 16 తేదీలలో జరిగే సెమీఫైనల్స్ వేదికలు మాత్రం బీసీసీఐ ఇంకా ఖరారు కాలేదు.

ఇక వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఆడే షెడ్యూల్ ఇదే: అక్టోబర్ 8 చెన్నై వేదికగా భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది.అక్టోబర్ 11 ఢిల్లీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా, అక్టోబర్ 15 అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్తాన్, అక్టోబర్ 19 పూణే వేదికగా భారత్-బంగ్లాదేశ్, అక్టోబర్ 22 ధర్మశాల వేదికగా భారత్-న్యూజిలాండ్, అక్టోబర్ 29 లక్నో వేదికగా భారత్-ఇంగ్లాండ్, నవంబర్ 2న ముంబై వేదికగా భారత్-క్వాలిఫైయర్ టీం, నవంబర్ ఐదు న కోల్ కత్తా వేదికగా భారత్-దక్షిణాఫ్రికా, నవంబర్ 11న బెంగుళూరు వేదికగా భారత్-క్వాలిఫైయర్ టీం మధ్య మ్యాచ్ జరగనుంది.