అక్టోబర్ లో జరుగనున్న టీ-20 ప్రపంచకప్ 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.అందరూ ఊహించినట్టే ఐపిఎల్ స్టార్ట్స్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లకు చోటు దక్కింది.
సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా బీసీసీఐ చోటిచ్చింది.అయితే జుట్టు లో కచ్చితంగా ఉంటారు అనుకున్నా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, సీనియర్ శిఖర్ ధావన్, పేసర్ దీపక్ చహల్, ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాలకు నిరాశ ఎదురైంది.
రెండేళ్లుగా ఐపీఎల్ టోర్నీలో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఇటీవల టీమిండియాలో చోటు దక్కించుకున్నారు.అక్కడ సత్తచాటడం ద్వారా ఏకంగా భారత్ టీ20 ప్రపంచ కప్ లో అవకాశం దక్కింది.
భారత్ మేనేజ్మెంట్ ఈ ఇద్దరిపై భారీ ఆశలే పెట్టుకుంది.జట్టులో చోటు ఆశించిన శిఖర్ ధావన్ కు భారత్ మొండిచేయి చూపింది.
అలాగే గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ కు నిరాశే ఎదురయింది.సిన్నర్ యుజ్వేంద్ర చహల్, సీనియర్ శిఖర్ ధావన్, పేసర్ దీపక్ చహల్, ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాలకు పక్కన పెట్టడం కాస్తా ఆశ్చర్యంగా ఉంది.టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 15 – నవంబర్ 15 మధ్య భారతంలో జరగాల్సిఉంది కరోనా నేపథ్యంలో టోర్నీ వేదికను భారత్ నుంచి యూఏఈ వేదికగా తరలించారు.అక్టోబర్ 15 నుంచి నవంబర్ 14 వరకు టి20 ప్రపంచ కప్ 2021 జరుగనుంది.

భారత్ టీ20 ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ర్పీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ ( స్టాండ్ బై శ్రేయస్ అయ్యర్, చార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్).
.