బర్రెలక్క ( Barrelakka ) అలియాస్ శిరీష ( Shirisha ) పరిచయం అవసరం లేని పేరు సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు.అలా సెలబ్రిటీలుగా మారినటువంటి వారిలో ఈమె కూడా ఒకరు.
డిగ్రీ వరకు చదివి ఎలాంటి ఉద్యోగం లేకుండా నిరుద్యోగిగా ఉన్నటువంటి ఈమె బర్రెలు కాస్తూ తాను బర్రెలు కాసుకుంటూ ఉన్నానని ఒక వీడియో చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
ఇలా అప్పటినుంచి ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ వచ్చేవారు.
ఇలా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ఏకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.గత కొద్దిరోజుల క్రితం జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇక ఈమె రాజకీయాలలోకి రావడంతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.ఇలా రాజకీయాల పరంగా ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొంటూ కూడా ఈమె వార్తలలో నిలిచారు.ఇక ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టినటువంటి శిరీష తన పెళ్లికి సంబంధించిన ఎన్నో వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.ఇలా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నటువంటి ఈమె తాజాగా సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.
తాను ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎంపీ అభ్యర్థిగా కూడా వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇలా ఎంపిక పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు.
ఇకపోతే ఇటీవల అంబేద్కర్ ( Ambedkar ) జయంతి సందర్భంగా ఈమె అంబేద్కర్ చిత్రపటానికి పూజ చేసి కొబ్బరికాయ కొడుతూ ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియో భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది.ఈ వీడియోలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల కాకుండా ఇంటి పరిసర ప్రాంతాలలో దొరికే పువ్వులతో మాల కుట్టి వేశారు.దీంతో ఎంపీ అభ్యర్థికి పూలమాలకు డబ్బులు లేవా అంటూ భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
మరికొందరు నువ్వు పూజ చేస్తే చేసుకున్నావు కాని ఇలాంటి వీడియోలు షేర్ చేయడం అవసరమా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు ఘనంగా పెళ్లి చేసుకున్నటువంటి బర్రెలక్కకు పూలదండకు డబ్బులు లేవేమో డొనేషన్స్ ప్లీజ్ అంటూ ఈ వీడియో పై నేటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.