మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు.ఈ మేరకు మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభకు ఆయన హాజరుకానున్నారు.
సాయంత్రం 5 గంటలకు సుల్తాన్ పూర్ వేదికగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది.సభకు మెదక్ మరియు జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా జన సమీకరణ చేయనున్నారు నేతలు.
ఈ క్రమంలో సభా ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.కేసీఆర్ సభ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.