టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో బాపు ( Bapu ramana )ఒకరు కాగా బాపు, రమణ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.హృద్యంగా, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలను తెరకెక్కించడంలో బాపు రమణ ముందువరసలో ఉంటారు. బాపు రమణ తెరకెక్కించిన పెళ్లి పుస్తకం సినిమా ( Pelli Pustakam ) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే.1991 సంవత్సంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.
ఈ సినిమా స్క్రిప్ట్ లో ఒక సన్నివేశంలో ఇద్దరు వ్యక్తులు బాదం ఆకుల విస్తర్లలో ఇడ్లీలు తింటున్నారని పేర్కొన్నారు.షాట్స్ రాసే సమయంలో దర్శకుడు బాపు కూడా బాదం ఆకుల విస్తర్లు కావాలని ప్రొడక్షన్ టీంకు రాసిచ్చారు.బాదం ఆకుల విస్తర్లు దొరకకపోవడంతో ప్రొడక్షన్ వాళ్లు మామూలు విస్తరాకులు తెచ్చారు.ఈ విషయం తెలిసిన బాపు బాదం ఆకులు దొరక్కపోవడం ఏంటి? ఏమేం కావాలో మనవాళ్లు నిన్న పొద్దునే రాసిచ్చాను? బాదం ఆకుల విస్తర్లే కావాలి.వెళ్లి తీసుకురండి. హైదరాబాద్ మహా నగరంలో ( Hyderabad )బాదం చెట్టు లేదా అంటూ బాపు ప్రొడక్షన్ వాళ్లపై కసిరి షూటింగ్ ఆపేశారు.
ప్రొడక్షన్ వాళ్లు రెండు కార్లలో హైదరాబాద్ అంతటా అటూఇటూ తిరిగి చిక్కడపల్లిలోని ఒకరింట్లో బాదంచెట్టు ఆకులను కోసి వాటిని విస్తర్లుగా కుట్టించి సీన్ ను షూట్ చేశారు.ఆ సీన్ కోసం తయారు చేసిన ఇడ్లీలు చల్లారిపోవడంతో మళ్లీ ఇడ్లీలు తయారు చేయించి ఆ సన్నివేశాన్ని షూట్ చేయడం జరిగింది.విచిత్రం ఏంటంటే నిడివి ఎక్కువ కావడంతో సినిమాలో మాత్రం ఈ సన్నివేశాన్ని కట్ చేశారు.
పెళ్లి పుస్తకం సినిమా ఈ జనరేషన్ ప్రేక్షకులకు సైతం ఎంతగానో నచ్చుతోంది.ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూ ఉంటాయి.దర్శకుడు బాపు వాస్తవానికి దగ్గరగా తన సినిమాలను తెరకెక్కించారనే సంగతి తెలిసిందే.