వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కేసుపై హైదరాబాద్ నాంపల్లి కోర్టులో విచారణ వాయిదా పడింది.గత నెల 24న కానిస్టేబుల్, ఎస్సైపై చేయి చేసుకున్న ఘటనలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో షర్మిలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ప్రస్తుతం బెయిల్ పై ఉన్న షర్మిల ఇవాళ కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంది.అయితే షర్మిల తరపు న్యాయవాది కోర్టులో గైర్హాజరు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో తదుపరి విచారణను నాంపల్లి కోర్టు వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది.