ఈ మధ్య కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.కాగా తాజాగా ఓ బ్యాంకు మేనేజర్ కస్టమర్ల అవసరాలు తెలుసుకుని వాళ్ళకి సహాయం చేయాల్సిందిపోయి ఏకంగా వారిని లైంగికంగా వేధించి తన కామ కోరికలు తీర్చుకుంటున్న ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ ప్రముఖ బ్యాంకులో నగేష్ అనే వ్యక్తి మేనేజర్ గా పని చేస్తున్నాడు.అయితే గత కొద్ది కాలంగా నాగేష్ లోన్ కోసం బ్యాంకుకి వచ్చేటువంటి మహిళల ఫోన్ నెంబర్లు తీసుకొని బ్యాంక్ లోన్ కావాలంటే తన కోరిక తీర్చాలని డిమాండ్ చేస్తున్నట్లు పలువురు మహిళలు ఆరోపించారు.
అంతేకాకుండా ఇప్పటికే కొందరు మహిళలు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు బ్యాంకులో లోన్ కి అప్లై చేయగా నగేష్ వారిని లోబరుచుకుని తన కామ కోరికలు తీర్చుకున్నాడు.దీంతో తాజాగా మరో మహిళను కూడా లైంగికంగా వేధించడంతో మహిళ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించింది.
దీంతో ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ నగేష్ వెంటనే బ్యాంకు నుంచి పరారయ్యాడు.దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నగేష్ గదిలోని సీసీ కెమెరాలను పరిశీలించగా నగేష్ మహిళలతో జరుగుతున్న “రాసలీలలు” గురించి బయట పడింది.దీంతో ప్రస్తుతం పోలీసులు నగేష్ ని పట్టుకునే పనిలో పడ్డారు.