December Bank Holidays : డిసెంబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

పేదవాళ్ళనుండి సంపన్నుల వరకు ప్రతిరోజూ సంబంధం ఏర్పరుచుకొనేది బ్యాంక్ తోనే.ఎందుకంటే సగటు మనిషి జీవనయానం డబ్బుతో ముడి పడి ఉంటుంది కనుక.

అందుకే మనం బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే ఆయా బ్యాంకులు ఏయే రోజుల్లో ఓపెన్ వుంటాయో, ఏయే రోజుల్లో సెలవు ఉంటుందో తెలుసుకోవడం ఉత్తమం.నవంబర్ నెల ముగియడానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి.

డిసెంబర్ 2022లో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ వచ్చే నెలలో అంటే డిసెంబర్‌లో 13 రోజుల సెలవులు ఉండబోతున్నాయి అని మీకు తెలుసా? ఈ సమయంలో బ్యాంకులు తెరవబడవు కాబట్టి మీ బ్యాంకింగ్ సంబంధిత పనులు నిలిచిపోవచ్చు.అందుకే బ్యాంకుకి సంబంధించి మీరు జీతం ఖాతా, మీరు లోన్ పని కోసం, డిమాండ్ డ్రాఫ్ట్ చేయడానికి లేదా ఏదైనా చెక్ సంబంధిత పని కోసం బ్యాంకుకు వెళ్ళల్సి వచ్చినపుడు మీ పనిని ఇప్పుడే త్వరగా పరిష్కరించుకోండి.

ఇక్కడ ఇపుడు బ్యాంక్ సెలవుల జాబితాను ఒకసారి పరిశీలిద్దాము.బ్యాంకు సెలవుల జాబితా వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలపై ఆధారపడి ఉంటుందని మీకు తెలిసినదే.అయితే కస్టమర్లకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ మునుపటిలానే కొనసాగుతుంది.

Advertisement

దీనితో పాటు, ATM సేవలు కూడా పనిచేస్తాయి.

కానీ మీ పని మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉంటే, ఈ రోజుల్లో కుదరదు.RBI విడుదల చేసిన జాబితా ప్రకారం, డిసెంబర్‌లో బ్యాంకులు 8 రోజులు మాత్రమే మూసివేయబడతాయి.అయితే ప్రతి నెల వచ్చే రెగ్యులర్ సెలవులు లెక్కేస్తే మాత్రం మొత్తం 13 సెలవులు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, న‌గ‌రాల్లో వ‌చ్చే నెల మూడో తేదీన‌, 12,19, 26, 29,30,31 తేదీల్లో బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయి.అలాగే 4,10,11,18,24,25 తేదీల్లో ఆదివారాలు, రెండో శ‌నివారం, నాలుగో శ‌నివారం సంద‌ర్భంగా బ్యాంకులు ప‌ని చేయ‌వు.

ఈ సందర్భంలో మొత్తం బ్యాంకు సెలవులు 13 రోజులు అన్నమాట.

కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో...?
Advertisement

తాజా వార్తలు