పవన్ ‌కు అభిషేకం చేసే ఛాన్స్ కావాలంటున్న బండ్లన్న...!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు.పవన్ కళ్యాణ్.

ఆ పేరు వింటేనే చాలా మంది ఏదో పూనకం వచ్చినట్లు తెగ హడావిడి చేస్తుంటారు ఆయన అభిమానులు.అయితే పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌కు ఎంత మంది అభిమానులు ఉన్న బండ్ల గణేష్ స్థానం ప్రత్యేకం.

బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదో చిన్న చిన్న పాత్రలలో నటించి మెప్పించారు.అనంతరం ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్‌ మార్‌, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలను బండ్ల గణేష్ నిర్మించాడు.

ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో బండ్ల గణేష్ కి పవన్ మీద ఉన్న అభిమానం కాస్త భక్తిగా మారిపోయింది.

Advertisement

ఇక అప్పటి నుండి తనకు ఎక్కడ మాట్లాడాల్సిన అవకాశం వచ్చిన సరే పవన్ కళ్యాణ్ గురించి దేవుడు అంటూ చెబుతుంటాడు బండ్లన్న.ఇక పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ బర్త్‌ డే రోజున బండ్ల గణేష్ ఎలా విష్ చేస్తారో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

అయితే బండ్ల గణేష్ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అందుకు తగ్గట్టుగానే స్పందించారు.ఇక బండ్ల గణేష్ ఏకంగా పవన్‌ కళ్యాణ్ ను పరమ శివుడితో పోలుస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సందేశాన్ని పంపాడు.

అంతేకాక బండ్ల గణేష్ `ఈశ్వర పరమేశ్వర పవన్ ఈశ్వర ఎప్పుడు నీకు మరోసారి అభిషేకం చేసే అదృష్టం అందుకో జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు.ఇక కరోనా క్లిష్ట పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించకపోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.

సిసిల మీడియా లో #HBD Pawankalyan హ్యాష్ ట్యాగ్ తో తెగ ట్రెండ్ గా కొనసాగుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు