నిన్న సామర్లకోట లో జరిగిన బహిరంగ సభలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( CM Jagan ) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా జగన్ , పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు.పవన్ మూడు పెళ్లిళ్ల అంశాన్ని ప్రస్తావించారు.
ఒకరు లోకల్ ఒకరు, నేషనల్ ఇంకొకరు, ఇంటర్నేషనల్ అంటూ పవన్ భార్యల ఉద్దేశించి పరోక్షంగా జగన్ సెటైర్లు వేశారు.దీనిపై జనసేన , టిడిపి వర్గాలు తీవ్ర స్థాయిలో జగన్ పై విమర్శలు చేస్తుండగా, తెలంగాణకు చెందిన కమెడియన్, నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు.
జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలను బండ్ల గణేష్( Bandla Ganesh ) ఖండించారు.పవన్ కళ్యాణ్ సమాజానికి ఉపయోగపడే మనిషి, ఆయనపై ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం తగదు అంటూ ఒక వీడియోను విడుదల చేశారు.

” అందరికీ నమస్కారం .నిన్నటి నుంచి మనసులు ఒకటే వేదన, ఒకటే బాధ.ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నా బతుకు ఎందుకు అని నాకే అనిపిస్తుంది.చిరాకు తెప్పిస్తోంది.
నిన్న సీఎం జగన్ నాకు ఇస్టుడైన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి కొన్ని అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు.ఇవి నాకు ఎంతో బాధ కలిగించాయి.
నేను కొన్ని దశాబ్దాల పాటు పవన్ కళ్యాణ్ వెంట తిరిగాను.ఆయన వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు.
ఆయన చాలా నిజాయితీపరుడు, నీతిమంతుడు ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నా , నేనున్నా అంటూ ముందుండి సాయపడే వ్యక్తి.ఇప్పుడు అలాంటి మనిషి గురించి మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.
జీవితంలో అందరికీ అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.అవి కూడా ఆయన ప్రేమే లేకుండా జరిగినవే అని నేను భావిస్తున్నాను.

‘పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి పదేపదే మాట్లాడడం బాధగా ఉంది మీకు విన్నవిస్తున్నారు పవన్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి దేశం కోసం బతికే మనిషి స్వార్థం కోసం కానీ , స్వలాభం కోసం కానీ, ఏనాడు పని చేయలేదు.హాయిగా ఆయన షూటింగులు చేసుకుని సూపర్ స్టార్ హోదాతో హాయిగా బతకండి అని నేను తరుచూ చెబుతూనే ఉండే వాడిని.కానీ ఆయన జనాల కోసం ఏదో ఒకటి చేయాలని రాజకీయాల్లోకి ( Politics )వచ్చారు.రాత్రి పగలు కష్టపడి సంపాదించిన డబ్బులు పార్టీకి ప్రజలకు ధారపోస్తున్నాడు.ఆయనకు కులాభిమానం లేదు.అందరూ ఒకటే అని భావిస్తారు .ఒకవేళ ఆయనకే కులపిచ్చి ఉంటే నన్ను ఇంతలా ఆదరిస్తాడా , నన్ను ఈ స్థాయికి తీసుకొస్తాడా ? నేను ఈరోజు అనుభవిస్తున్నదంతా కూడా పవన్ పెట్టిన బిక్ష. ఆయన చాలా మంచి వ్యక్తి సార్ .దయచేసి తెలిసి తెలియకుండా ఆయనపై అబాండాలు వేయకండి .నేను జనసేన మనిషిని, కార్యకర్తని ఏమాత్రం కాదు .కేవలం ఆయనను ప్రేమించే వ్యక్తిని ‘ అంటూ బండ్ల జగన్ కు విజ్ఞప్తి చేశాడు.