ఇక చాలు నోరు మూసుకో... పృథ్వీ రాజ్ కు వార్నింగ్ ఇచ్చిన బండ్ల గణేష్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నటుడు పృథ్వీరాజ్ (Pruthvi Raj)చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఈయన కమెడియన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పృథ్వీరాజ్ రాజకీయాలలోకి వచ్చారు గతంలో వైసీపీ పార్టీ(Ysrcp Party)లో ఉన్నటువంటి ఈయన ప్రస్తుతం జనసేన పార్టీ (Janasena Party)లోకి రావడంతో నిత్యం వైకాపా గురించి విమర్శలు చేస్తూనే ఉంటారు.

 Bandla Ganesh React On Pruthvi Raj Comments , Pruthvi Raj, Bandla Ganesh, Laila-TeluguStop.com

ఇక సినిమా వేదికలపై కూడా ఈయన రాజకీయాల గురించి పరోక్షంగా మాట్లాడుతూ వైకాపా పై సెటైర్లు వేయటంతో సినిమాలు ఇబ్బందులలో పడుతున్నాయి.

Telugu Bandla Ganesh, Laila, Pruthvi Raj, Vishwak Sen-Movie

తాజాగా విశ్వక్ సేన్(Vishwak Sen) లైలా(Laila) సినిమా సైతం వివాదాలలో చిక్కుకుంది.ఈయన పరోక్షంగా వైసిపికి గత ఎన్నికలలో వచ్చిన సీట్లను ఉద్దేశించి చేసిన కామెంట్ల వల్ల వైకాపా అభిమానులు బాయికాట్ లైలా మూవీ అంటూ హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.అయితే ఈయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంతోమంది సినీ రాజకీయ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న బండ్ల గణేష్ (Bandla Ganesh)రాజకీయాలపై కూడా మాట్లాడుతూ తరచూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ ఉంటారు అయితే తాజాగా పృథ్విరాజ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఈయన స్పందిస్తూ ట్వీట్ చేశారు.

Telugu Bandla Ganesh, Laila, Pruthvi Raj, Vishwak Sen-Movie

ఎప్పుడూ కూడా సినిమా ఇండస్ట్రీని రాజకీయాలను ఒకే విధంగా చూడకూడదు.రాజకీయాలలో కొనసాగుతూ ఎంతో మంది సెలబ్రిటీలు సినిమాలు కూడా చేస్తున్నారు అయితే సినిమా వేదికలపై వీళ్ళు ఎవరు కూడా రాజకీయాల గురించి మాట్లాడకూడదు.ఇలాంటి వారి విషయంలోకి నిర్మాతలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి వారి నోటి దూల కారణంగా సినిమాకు ఇబ్బందులు రావటం బాధాకరమని తెలిపారు.

ఇకపై ఇలా సినిమా వేదికలపై రాజకీయాల గురించి మాట్లాడుకుండా ఉంటే మంచిది సినిమాని కేవలం సినిమా లాగా చూడండి అంటూ ఈయన పృథ్వీరాజ్ కామెంట్లకు తనదైన శైలిలోనే స్పందిస్తూ పోస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube