నో డౌట్.. బండి సంజయే దిక్కు !

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై గత కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ ని మార్చే అవకాశం ఉందని, ఆయన పని తీరు అధిష్టానానికి నచ్చడం లేదని ఇలా రకరకాల వార్తలు షికారు చేశాయి.

ఒకానొక సమయంలో అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్ ను వరించే అవకాశం ఉందనే రూమర్స్ కూడా వినిపించాయి.అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అధ్యక్ష మార్పు విషయంలో బీజేపీ అధిష్టానం పెద్దగా ఆసక్తి కనబరచడం లేదట.

బండి సంజయ్ నాయకత్వంపై హైకమాండ్ పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే ఈ ఎన్నికలకు బండి సంజయ్ నాయకత్వంలోని బరిలోకి దిగాలని డిల్లీ పెద్దలు భావిస్తున్నారట.

ఇదే విషయాన్ని ఇటీవల డిల్లీలోని నడ్డా నివాసంలో జరిగిన భేటీలో అమిత్ షా తెలంగాణ నేతలకు వెల్లడించరాట.నిజానికి తెలంగాణ బీజేపీకి బండి అధ్యక్ష బాద్యతలు చేపట్టిన తరువాత పార్టీ అనుకున్నా దాని కంటే కాస్త ఎక్కువే బలపడింది.గతంతో పోలిస్తే పార్టీ మెరుగైన పొజిషన్ లోనే ఉంది.

Advertisement

బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన చేపట్టిన పాదయాత్ర పార్టీకి మంచి మైలేజ్ తెచ్చిందని అందుకే బండి సంజయ్ ని అద్యక్ష పదవి నుంచి తప్పించేందుకు అధిష్టానం మొగ్గు చూపలేదట.ఇక ఈసారి ఎలాగైనా బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు రావాలని బండి సంజయ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

కే‌సి‌ఆర్ పై బి‌ఆర్‌ఎస్ నేతలపై పదునైన మాటలతో ఘాటు విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

అలాగే బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే భావనను ప్రజల్లో గట్టిగానే కలిగిస్తున్నారు.ఇక బండి సంజయ్ నాయకత్వమే మళ్ళీ కన్ఫర్మ్ కావడంతో ఇతర నేతలంతా కూడా అద్యక్ష పదవిపై ఆశలు వదిలేసుకున్నట్లే అని చెప్పాలి.ఇక గతంతో పోలిస్తే ప్రజల దృష్టి కూడా బీజేపీ పై గట్టిగానే పడుతుండడంతో ఈసారి ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు చెక్ పెట్టడం ఖాయం అని కమలనాథులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఎన్నికల సమయంలో వ్యూహాలకు పదును పెట్టి ఆపరేషన్ ఆకర్ష్ ను కూడా కాషాయ పార్టీ బలంగానే అమలు చేసే అవకాశం ఉంది.ముఖ్యంగా బి‌ఆర్‌ఎస్ నేతలే టార్గెట్ గా వ్యూహాలు రచించే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..

ఇలా అన్నీ విధాలుగా బీజేపీని బలంగా ముందుకు తీసుకుపోతున్న బండి సంజయ్.వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఎలాంటి ఫలితాలను అంధిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు