బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ గుండాలు పోలీస్ సహకారంతో దాడి చేశారు.
పోలీస్ డైరెక్షన్ లో దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం.దాడి ఎందుకు చేశారో అర్థం కావడం లేదు.
దాడి జరిగిన సమయంలో డీఎస్ ఇంట్లో లేకపోవడం అదృష్టం.దాడి జరిగిన స్థలంలోనే మొన్నటివరకు డీఎస్ రెస్ట్ తీసుకున్నారు.
ఫోబియా వల్లే దాడులు చేస్తున్నారు.దుర్గా దేవి, తులసి మాత పై దాడి చేశారు.
దేవుళ్ళపై దాడి చేశారు.ఇంటి పై దాడి చేసినందుకు బాధ లేదు.
దేవుళ్లపై దాడి చేసినందుకే బాధగా ఉంది.హిందువులైతే దేవుళ్ళ పై దాడి చేయరు.
అక్క రెడీ అనగానే తమ్ముళ్లు రెడీ అయ్యారు.విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలి.
అరవింద్ భూతులు మాట్లాడలేదు.
పోలైట్ గా మాట్లాడారు.
దాడి మా పార్టీ వాళ్ళు చేసినా తప్పే.ఇంటిపై మా పార్టీ వాళ్ళు దాడి చేసినా నేను సహించను.
ప్రాణాలు పోతే నువ్వు ఇస్తావా? మీ అయ్య ఇస్తాడా?రాజకీయాల కోసం కేసీఆర్ తన సొంత బిడ్డనే పావుగా వాడుకుంటున్నాడు.దాడిపై ముఖ్యమంత్రి స్పందించడం లేదు.
ఎన్నికలు ఎప్పుడోస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.కేసీఆర్ కుటుంబాన్ని పొలిమేర దాకా తరమడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
పోలీసులు ఖాకీ డ్రెస్ వదిలేసి పింక్ డ్రెస్ వేసుకోవాలి.సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

తండ్రిగా ఎవరు పట్టించుకోవడం లేదు.కేసీఆర్ పిల్లలు తండ్రి కంట్రోల్ లో లేరు.దాడిపై అమిత్ షా ఆరా తీశారు.
అమిత్ షా అరవింద్ కి కాల్ చేసి భరోసా కల్పించారు.కేసీఆర్ నే మేం పట్టించుకోలేదు.
వాళ్ల బిడ్డని ఎవరు పట్టించుకుంటారు.నాకు నోటీసులు వస్తే తీసుకుంటాను.
నోటీసులు వస్తే జ్వరం వచ్చిందనో, కన్ను నొప్పి అనో, కరోనా వచ్చిందనో తప్పించుకొను.కేసీఆర్ ఏం చేస్తున్నాడో ఆయనే రెండు గట్టి పెగ్గులేసి ఆలోచించుకోవాలి.అభివృద్దిపై ఆలోచించకుండా ఎప్పుడు ఎవరి ఇల్లు కుల్చాలో ఆలోచిస్తున్నాడు.ఆట మేమే మొదలు పెట్టాం, ఎండింగ్ కూడా మేమే చూపిస్తాం.
కేసీఆర్ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు.మా ఎండింగ్ భయంకరంగా ఉంటుంది.
మాకు జైళ్లు, కేసులు, దాడులు కొత్త కాదు.దాడులు చేయిస్తారో, అపుతారో కేసీఆర్ స్పందించాలి.