కేఆర్ఎంబీ ఛైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.తెలంగాణ సమస్యలపై 70 లేఖలు రాసినా స్పందన లేదన్నారు.
అంతరాష్ట్ర ఒప్పందాల నిబంధనలు కేఆర్ఎంబీ అమలు చేయాలని కోరారు.తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కేఆర్ఎంబీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కృష్ణానదిలో తాత్కాలికంగా కేటాయించిన వాటాను కొనసాగించడం సరికాదని పేర్కొన్నారు.ఒక సంవత్సరం మాత్రమేనని మళ్లీ పాత వాటానే కొనసాగిస్తున్నారని వెల్లడించారు.
కేడబ్ల్యూడీటీ -2 అవార్డు ఖరారు అయ్యే వరకు 50:50 నిష్ఫత్తిలో కృష్ణా జలాలను కేటాయించాలన్న పట్టించుకోవడం లేదని లేఖలో తెలిపారు.







