సుడిగాలి సుదీర్ హీరో గా గాలోడు అనే సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.పెద్ద సినిమా లతో పాటు క్రేజీ హీరోల సినిమా లు లేకపోవడం తో మంచి టైం చూసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాలోడు సినిమా మంచి కలెక్షన్స్ నమోదు చేసింది.
ఒక్క రోజులోనే కోటి రూపాయలకు పైగా వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా కి లాంగ్ రన్ లో కనీసం ఐదు నుండి ఏడు కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఈ సమయం లో అల్లరి నరేష్ హీరో గా నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా కూడా కచ్చితం గా మంచి వసూళ్లు నమోదు చేస్తుంది.
అనే నమ్మకం తో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.

గాలోడు సినిమా కి ఎలా అయితే సోలో రిలీజ్ కలిసి వచ్చిందో అలాగే మా సినిమా కూడా కచ్చితంగా సోలో రిలీజ్ కలిసి వచ్చి భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ చిత్ర యూనిట్ సభ్యులు పాజిటివ్ థింక్ చేస్తున్నారు.సినిమా కు పాజిటివ్ టాక్ వస్తే చాలు కచ్చితంగా రెండున్నర నుండి మూడు కోట్ల రూపాయల కలెక్షన్స్ మొదటి రోజే వచ్చి పడడం ఖాయం అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమా అంటే మినిమం గ్యారంటీ సినిమా అన్నట్లుగా ఉండేది కానీ ఈ మధ్య కాలం లో ఆయన సినిమా లకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ తగ్గడం లేదు.
కానీ ఈ సినిమా తప్పకుండా ఒక భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్మకాన్ని ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయం లో ఒక సోలో రిలీజ్ గా రాబోతున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఎలాంటి కలెక్షన్స్ ని వసూలు చేస్తుందే అనేది అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.







