Samantha: అనారోగ్యంతో కూడా అదే పనిలో ఉన్న సమంత.. కొత్తగా మరోటి కమిట్ అయ్యిందట!

సమంత మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఆమె ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు.

 Samantha Green Signal To New Project Details, Samantha, Samantha New Project, Sa-TeluguStop.com

షూటింగ్ మరియు ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవ్వడం లేదు.కానీ ఈ సమయం లో ఆమె వరుసగా కథలను వింటూ మూడు నాలుగు సినిమాలకు ఓకే చెప్పింది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇటీవల హీరోగా పరిచయమై దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ చెప్పిన కథ కు సమంత ఓకే చెప్పిందని.అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత సమంత మొదట ఆ సినిమానే చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సమంత కు మరియు రాహుల్ రవీంద్రన్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఇద్దరు కూడా గతంలో పరిచయాలు ఉన్నవారే, ఇప్పుడు వారిద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు అంటూ అధికారికంగా సమంత సన్నిహితులు ప్రకటించారు.

రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి కి సమంత కి ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ స్నేహం తోనే ఆమె భర్త తో సమంత సినిమా కు ఒప్పుకొని ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల యశోద సినిమా కు కనీసం ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా హాజరు కాలేక పోయినా సమంత ఇప్పుడు ఏకంగా కొత్త సినిమా కు కమిట్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Rahul Ravindran, Samantha, Samantharahul, Shaakuntalam, Chinmayi, Yashoda

మొత్తానికి సమంత ఈ సమయం లో కూడా ఖాళీగా ఉండకుండా కొత్తగా మరో సినిమాని కమిట్ అవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు సమంత యొక్క శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధం గా ఉన్న విషయం తెల్సిందే.యశోద సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుని మంచి వసూళ్లు నమోదు చేసిన కారణంగా శాకుంతలం సినిమా కూడా త్వరలోనే విడుదల చేసి యశోద యొక్క సక్సెస్ ను ఉపయోగించుకోవాలని గుణ శేఖర్ భావిస్తున్నాడని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube