ఈ తెలుగు హీరో చిన్న వయసులోనే గుండె జబ్బుతో మరణించాడట...

తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు డాక్టర్ కిరణ్ దర్శకత్వం వహించిన "అభి" అనే చిత్రంలో హీరోగా నటించి సినిమా పరిశ్రమకి హీరోగా పరిచయమైన ప్రముఖ స్వర్గీయ నటుడు కమలాకర్ రెడ్డి గురించి సినిమా పరిశ్రమలో పెద్దగా తెలియని వారు ఉండరు.

అయితే కమలా కర్ రెడ్డి తెలుగులో దాదాపుగా ఐదుకి పైగా చిత్రాలలో హీరోగా నటించాడు.

అప్పుడప్పుడే కెరియర్ లో హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో అనుకోకుండా గుండె జబ్బు బారిన పడి మృతి చెందాడు.అయితే ఉన్నత కుటుంబం నుంచి కమలా కర్ రెడ్డి సినిమా పరిశ్రమకి వచ్చినప్పటికీ సొంతంగా తన నటనా ప్రతిభను నిరూపించుకుని హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు.

కానీ అప్పటికే గుండె పోటు సమస్యతో బాధ పడుతున్న కమలాకర్ రెడ్డికి ఉన్నట్లుండి హఠాత్తుగా గుండె పోటు రావడంతో అతడి కుటుంబ సభ్యులు చెన్నైలో ఉన్నటువంటి ఓ ప్రముఖ ఆసుపత్రికి చికిత్స నిమిత్తమై తరలించారు.కానీ అప్పటికే గుండె పోటు సమస్య అధికమవడంతో జూలై 14వ తారీఖున ఆస్పత్రిలోనే కన్ను మూసాడు.

కాగా కమలాకర్ సోదరుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా పని చేశాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో కమలాకర్ రెడ్డి సంచలనం, హాసిని, బ్యాండ్ బాలు, తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు.

Advertisement

ఈ చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ కమలాకర్ రెడ్డి కి నటుడిగా మంచి గుర్తింపు మాత్రం తీసుకు వచ్చాయి.అయితే తెలుగులో చివరగా కమలా కర్ రెడ్డి బ్యాండ్ బాలు చిత్రంలో నటించినా గుండె పోటు కారణంగా విడుదల కాకముందే అనుకోకుండా మృత్యువాత పడ్డాడు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు