త‌న మంత్రి ప‌ద‌వి పోయినా ప‌ర్వాలేదంటున్న బాలినేని.. మార్పు ఖాయ‌మేనా..?

ఏపీలో మంత్రి ప‌ద‌వుల్లో మార్పులు ఉంటాయ‌నేది చాలా రోజులుగా వినిపిస్తున్న మాట‌.

రెండున్న‌రేండ్ల త‌ర్వాత మంత్రిప‌ద‌వుల్లో మార్పులు ఉంటాయ‌ని మొద‌ట్లోనే చెప్పిన జ‌గ‌న్ ఇందుకు త‌గ్గ‌ట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారంట‌.

ఇప్పుడు ఆ స‌మ‌యం రావ‌డంతో అంద‌రిలోనూ తెగ ఉత్కంఠ నెల‌కొంది.ప‌లానా మంత్రి ఔట్ అంటూ అప్పుడే ప్ర‌చారాలు మొద‌ల‌య్యాయి.

అయితే ఇప్పుడు ఓ మంత్రి మాత్రం త‌న మంత్రిప‌ద‌వి మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.దీంతో నిజంగానే మార్పులు ఉండ‌బోతున్నాయ‌నే ప్ర‌చారం మొద‌లైంది.

మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాను జ‌గ‌న్‌కు విదేయుడ‌న‌ని, త‌న మంత్రి ప‌ద‌వి పోయినా త‌న‌కేం ప‌ర్వాలేద‌ని, త‌న‌కు పార్టీ ముఖ్య‌మ‌ని చెప్ప‌డం ఇప్పుడు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపుతోంది.రెండున్నరేళ్ల పాలన తర్వాత మార్పులు ఉంటాయ‌ని గ‌తంలోనే జ‌గ‌న్ చెప్పార‌ని, అలా అయితేనే కొత్త వారికి అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని చెప్పారు.

Advertisement

ప్రకాశం జిల్లాలో కొత్త‌గా జడ్పీ చైర్మన్ ఎన్నిక జ‌రిగిన మీటింగ్‌లో భాగంగా మంత్రి బాలినేని ఈ కామెంట్లు చేశారు.మరో రెండు నెలల్లోనే త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండున్నరేళ్లు కంప్లీట్ అవుతోంద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి ప‌ద‌వుల్లో మార్పులు ఖాయ‌మ‌ని ఆయ‌న మాటల్లోనే అర్థం అవుతోంది.

అంటే దీన్ని బ‌ట్టి ఇంకొంద‌రిపై కూడా వేటు ప‌డే ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఇక త‌మ‌పై వేటు ప‌డుతుంద‌ని తెలిసిన వారెవ్వ‌రూ కూడా ముందుకు వ‌చ్చి ఈ విష‌యంపై చెప్ప‌ట్లేద‌ని మంత్రి బాలినేని మాట‌ల‌ను బ‌ట్టి అర్థం అవుతోంది.మ‌రి రెడ్డి వ‌ర్గానికి చెందిన వారిని తీసేయ‌నే ప్ర‌చారం జ‌రుగుత‌న్న స‌మయంలో ఇప్పుడు బాలినేని కూడా రెడ్డి వ‌ర్గానికి చెందిన మంత్రి అయినా ఆయ‌న‌పై వేటు ప‌డుతోందంటే జ‌గ‌న్ అన్ని వ‌ర్గాల‌ను మార్చే ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

కాగా ఆయ‌న మంత్రి పోతుంద‌ని ఆయ‌న‌కు ముందే తెలుసా అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా అనే మాట‌లు కూడా వినిపిస్తున్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు