అమరావతి: సిఎం జగన్ తో ముగిసిన బాలినేని భేటీ.బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్స్.
నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల సమస్యలపై ముఖ్యమంత్రి వివరించా.నాలుగైదు రోజుల్లో నిధులు విడుదల సంబంధించి క్లియరెన్స్ ఇస్తానన్నారు.
ముఖ్యమంత్రి వచ్చి ఇలా పట్టాల పంపిణీ కార్యక్రమం పాల్గొంటా అన్నారు.ఒంగోలు నకిలీ డాక్యుమెంట్స్ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేయమని కోరింది నేనే.
ఎస్పీకి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు.
అనవసరమైన లీకులు ఇస్తే పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
నామీద లేనిపోని ఆరోపణ చేస్తే చూస్తూ ఊరుకోను.నేను ఎవరి జోలికి వెళ్ళను.
నా జోలికి ఎవరు వచ్చినా ఊరుకోను.నా రాజకీయ జీవితంలో వివాదాలు లేవు.
జిల్లాలో ఉన్న రాజకీయ ఇబ్బందులు ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చా.ఆయనే చూసుకుంటా అన్నారు.
ఈరోజు ప్రత్యేకంగా వాటి గురించి చెప్పలేదు.సిట్ విచారణ సంతృప్తికరంగా సాగుతుంది…
.