రూ.15 వేల బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్లు ఉండే 5జీ ఫోన్లు ఇవే..!

దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తృతంగా వ్యాపిస్తుండడంతో మొబైల్ ఫోన్ కొనాలి అనుకునే వారంతా 5జీ ఫోన్ల వైపే( 5G Phones ) చూస్తున్నాయి.కానీ 5జీ ధరలు కాస్త అధికంగా ఉండడంతో సామాన్యులు కొనలేక పోతున్నారు.

 Best 5g Mobiles Under 15k In Flipkart Big Diwali Sale Details, Best 5g Mobiles,u-TeluguStop.com

ఆలాంటి సామాన్యుల కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ దీపావళి సేల్( Flipkart Big Diwali Sale ) ప్రారంభించింది.ఈ బిగ్ దీపావళి సేల్ లో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన 5జీ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.రూ.15 వేల లోపు లభించే ప్రముఖ కంపెనీలకు చెందిన 5జీ ఫోన్లు ఏమిటో చూద్దాం.

Poco M6 ప్రో 5జీ:

బిగ్ దీపావళి సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ లో రూ.9999 కే పొందవచ్చు.ఈ ఫోన్ సాధారణ గేమింగ్ కోసం స్నాప్ డ్రాగన్ 4జెన్ 2 చిప్ సెట్ ను( Snapdragon 4 Gen 2 ) అందిస్తుంది.ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండి, 18W ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తోంది.

iQOO Z6 Lite 5G:

ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో రూ.13989 కే పొందవచ్చు.సాధారణ గేమింగ్ కోసం స్నాప్ డ్రాగన్ 4జెన్ 1 చిప్ సెట్ ను అందిస్తుంది.120Hz స్క్రీన్ తో ఉండే ఈ ఫోన్ మెరుగైన గేమింగ్, మీడియా వినియోగ అనుభవాన్ని అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ M14 5G:

ఈ ఫోన్ రెండు స్పెసిఫికేషన్ లలో వస్తుంది.శాంసంగ్ గెలాక్సీ M14 5G,( Samsung Galaxy M14 5G ) శాంసంగ్ గెలాక్సీ F14 5G.రెండిటిలోనూ ఒకే విధమైన పర్ఫామెన్స్ ఉంటుంది.కాకపోతే M సిరీస్ లో అదనంగా 2- మెగా పిక్సెల్ రియల్ కెమెరా ఉంటుంది.

ఈ రెండు ఫోన్లు 6000 mAh బ్యాటరీ తో వస్తాయి.ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే, చార్జర్ ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది.శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ ధర రూ.11,967.శాంసంగ్ గెలాక్సీ F14 ఫోన్ ధర రూ.11490 కే పొందవచ్చు.ఈ రెండు ఫోన్లలో ఏ ఫోన్ అయినా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే పది శాతం ప్రత్యేక కౌంట్ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube