బాబీ డియోల్ ను ఢీ కొట్టబోతున్న బాలయ్య...వీళ్ళ మధ్య ఫైట్ మామూలుగా ఉండదు అంటున్న డైరెక్టర్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు బాలయ్య బాబు.

( Balayya Babu ) ఇక తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో చాలా మంచి ఫాలోయింగ్ ను అయితే సంపాదించుకున్నాడు.

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మాస్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా భారీ డైలాగులతో బాలయ్య బాబు తన విశ్వరూపాన్ని చూపిస్తూ వస్తున్నాడు.

ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్ వచ్చిన వీళ్ళ సినిమాలైతే భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా బాలయ్య బాబు రౌద్ర రూపంలో ఎలా విజృంభిస్తాడో కూడా చూపించిన సినిమాలు కావడం విశేషం.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య, బాబీ డైరెక్షన్ లో( Director Bobby ) ఒక సినిమా చేస్తున్నాడు.ఆ సినిమాలో విలన్ గా బాబీ డియోల్( Bobby Deol ) నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక వీళ్ళ మధ్య ఒక భారీ ఫైట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక దానికి సంబంధించిన షూట్ ని కూడా తొందర్లోనే చేయాలనే ఉద్దేశ్యంలో ఒక భారీ సెట్ ను వేయిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

ఇక రామోజీ ఫిలిం సిటీ లో ఈ ఫైట్ సీక్వెన్స్ సంబంధించిన సెట్ వర్క్ కూడా నడుస్తుందట.ఇక తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన భారీ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కించడానికి దర్శకుడు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే వరుసగా మూడు సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకున్న ఆయన ఈ సినిమాతో సక్సెస్ ని అందుకుంటే మాత్రం ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలకు ఎవరికీ సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేస్తాడు.అందుకే బాలయ్య ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవడానికి కసరత్తులు చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు