మరో మైలు రాయిని చేరుకున్న వీరసింహారెడ్డి.. అది కదా బాలయ్య అంటే?

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమా ఏడాది ఆరంభంలో సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన విషయం తెలిసిందే.

 Balayya Veera Simha Reddy Achieves A New Milestone Details, Veera Simha Reddy, B-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇందులో బాలయ్య బాబు సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మించింది.

ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సృష్టించిన బాలయ్య బాబు సినిమా తాజాగా మరో మైలురాయిని దాటింది.

ఇకపోతే ఈ మధ్యకాలంలో వారంలో కనీసం నాలుగైదు సినిమాలు విడుదల అవుతుండడంతో స్క్రీన్ ల కోసం పోటీ పడుతున్నారు.థియేట్రికల్‌ బిజినెస్‌ 2-3 వారాల వ్యవహారంగా మారింది.ఇటువంటి సమయంలో కూడా వీర సింహారెడ్డి సినిమా 50 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా థియేటర్‌లో నడిచి అరుదైన, పెద్ద విజయం సాధించింది.

నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమా థియేటర్లలో విజయవంతంగా 50 రోజుల రన్‌ పూర్తి చేసుకుంది.ఈ చిత్రం 23 డైరెక్ట్‌, 54 షిఫ్టింగ్‌ థియేటర్లలో ఈ ఫీట్‌ సాధించింది.

ఇది బాలకృష్ణకు హయ్యెస్ట్‌ గ్రాసర్‌గా కూడా నిలిచింది.ఈ విధంగా బాలయ్య బాబు మూవీ మరో మైలు రాయిని దాటింది.

కాగా ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ షేర్ 75.7 కోట్లు సాధించింది.అఖండ తర్వాత ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది.అయితే గ్రాస్ నెంబర్స్ విషయంలో మాత్రం అఖండ టాప్ లో ఉంది.అఖండ సినిమా తర్వాత విడుదలైన వీరసింహారెడ్డి సినిమాతో మరో హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య బాబు.ఇటీవల ఈ సినిమా ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఓటీటీ లో కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube