మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పరువు హత్య తీవ్ర కలకలం సృష్టిస్తోంది.ఓ యువకుడిని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు.
అయితే యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.తమ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి తరపు బంధువులు ఆమె ఎదుటే యువకుడిని కత్తులతో నరికి చంపారని సమాచారం.
నిన్న రాత్రి 9 గంటల సమయంలో దూలపల్లి రహదారిలో వస్తుండగా యువకుడిపై దుండగులు ఎటాక్ చేశారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతుడు సూరారం కాలనీకి చెందిన దేవరకొండ హరీశ్ గా గుర్తించారు.







