కూతురుకు భయపడి ఆ అలవాటుకు దూరంగా ఉన్న బాలయ్య.. ఏమైందంటే?

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Balayya Careoff Daugher, Bala Krishna, Tollywood, Daughter, Tejaswini-TeluguStop.com

ఇటీవలే అఖండ సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న బాలయ్య ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై దృష్టిని సారించారు.ఇకపోతే బాలయ్య కలవాలీ అన్న సినిమాలు,డేట్స్,ప్రోగ్రామ్స్ కావాలి అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అన్న ప్రశ్నకు డాక్టర్ సురేంద్ర అన్న పేరు గట్టిగా వినిపించేది.

కానీ ఇప్పుడు మాత్రం మరొక పేరు వినిపిస్తోంది.ఆ పేరు మరెవరో కాదు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని.

 Balayya Careoff Daugher, Bala Krishna, Tollywood, Daughter, Tejaswini-కూతురుకు భయపడి ఆ అలవాటుకు దూరంగా ఉన్న బాలయ్య.. ఏమైందంటే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలకృష్ణ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు తేజస్విని మేనేజ్ చేస్తున్నారని తెలుస్తోంది.తండ్రి గెటప్, కాస్ట్యూమ్స్, లైన్ లు అన్నింటి మీదా ఆమె కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఈ నేపథ్యంలోనే తరచుగా సెట్ లోకి కూడా వస్తున్నారట.అయితే గతంలో బాలకృష్ణకు సంబంధించిన మిగిలిన విషయాలను ఆయన భార్య చూసుకునేది.

ఇప్పుడు ఆమె బాధ్యతలు కూడా చిన్న కూతురు తేజస్వినికి అప్పగించినట్లు సమాచారం.అయితే ఏ విషయంలోనూ ఎవరికి భయపడని బాలకృష్ణ సెట్ లోకి తన కూతురు వస్తుంది అన్న వార్త వినిపిస్తే చాలా బుద్ధిగా కూర్చుంటారట.

Telugu Bala Krishna, Tejaswini, Tollywood-Latest News - Telugu

అంతేకాకుండా ఎప్పుడైనా సిగరెట్ తాగే అలవాటు ఉన్న బాలకృష్ణ కూతురు ఉంటే దానిని కూడా పక్కన పెడుతున్నారట.అయితే బాలకృష్ణ పెద్ద కుమార్తె హెరిటేజ్ వ్యవహారాల్లో తప్ప మరెక్కడా కనిపించరు.చిన్న కుమార్తె ఇప్పుడు బాలయ్య వ్యవహారాలు చూసుకుంటున్నారు.అయితే ఇప్పుడు ఏ విషయంలోనూ, ఎవరికీ భయపడిన బాలకృష్ణ ఈ విధంగా తన కూతురికి భయపడుతుండడం అభిమానులను ఆశ్చర్యం కలిగిస్తోంది.

అంతేకాకుండా తన కూతురు వస్తుంది అన్న విషయాన్ని తెలుసుకొని బుద్ధిగా కూర్చోవడం అన్నది మరింత ఆశ్చర్యం కలిగించే విషయం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube