అన్ స్టాపబుల్ లాంచ్ డేట్ కన్ఫర్మ్.. మరో ఐదు రోజుల్లో ఫస్ట్ ఎపిసోడ్!

నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో అన్ స్టాపబుల్ విత్ NBK.

ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో నందమూరి బాలకృష్ణ షో ఒకటి.

ఆహా ఓటిటి లో స్టార్ట్ అయినా ఈ షో అందరి అంచనాలను మించి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.సినీ సెలెబ్రిటీలు అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 1 సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యింది.

ఇక ఇప్పుడు సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు ఈ సీజన్ వస్తుందా అని ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు.

అయితే అతి త్వరలోనే ఈ సీజన్ 2 స్టార్ట్ కాబోతుంది.ఈ క్రమంలోనే ఆహా వారు ఈ షో మీద ఇంట్రెస్ట్ పెంచేందుకు ప్రొమోషన్స్ స్టార్ట్ చేశారు.

Advertisement

ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2 యొక్క యాంతమ్ థీమ్ సాంగ్ ను రిలీజ్ చేసారు.ఇక ఈ మధ్యనే గ్రాండ్ గా బెజవాడలో ఈవెంట్ కూడా చేసారు.

ఇక ఇప్పుడు ఏవైటెడ్ సీజన్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు.ఇంట్రెస్టింగ్ ట్రైలర్ లాంటి వీడియోతో ఈ షో స్టార్ట్ అయ్యే డేట్ కూడా అనౌన్స్ చేసారు.

మరి ఈ వీడియో సాలిడ్ యక్షన్ వాల్యూస్ తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మార్క్ కనిపిస్తుంది.ఇక ఈ ట్రైలర్ లో బాలయ్య కొత్త లుక్ కూడా అదిరిపోయే లెవల్ లో ఉంది.

ఈ ఎడ్వెంచరస్ రైడ్ లో నెక్స్ట్ సీజన్ గురించి డేట్ ప్రకటించారు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ప్రశ్నల్లో మరింత ఫైర్! ఆటల్లో మరింత డేర్!! సరదాల్లో మరింత సెటైర్!!! మీకోసం.మరింత రంజుగా.దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!అంటూ బాలయ్య డైలాగ్ తో ఆకట్టుకున్నాడు.

Advertisement

ఈ సీజన్ అక్టోబర్ 14న మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుంది అని తెలిపాడు.ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రాబోతుంది.

మరి మొదటి ఎపిసోడ్ కు చంద్రబాబు నాయుడు గెస్ట్ గా రాబోతున్నాడు అని ఇప్పటికే ప్రచారం జరిగింది.పిక్స్ కూడా బయటకు వచ్చాయి.

మరి ఈ ఎపిసోడ్ ఎలా అలరిస్తుందో చూడాలి.

తాజా వార్తలు