మరో షో ద్వారా ఆహాలో సందడి చేయనున్న బాలయ్య... ఏమాత్రం తగ్గట్లేదుగా?

ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకి(Nandamuri Balakrishna) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.బాలయ్య అంటే ఒక బ్రాండ్.

 Balakrishna To Grace In Aha Indian Idol Season 2 Details, Balayya,thaman, Geetam-TeluguStop.com

ఈ క్రమంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న బాలయ్య బ్రాండ్ ఇమేజ్ ను ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా (Aha) క్యాష్ చేసుకుంది .బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ షో ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారు.ఈ టాక్ షో ఎంతంటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు.బాలయ్య తన ప్రశ్నలతో వచ్చిన అతిధులను ఒక ఆట ఆడుకున్నాడు.దీంతో ఈ షోకి అత్యధిక రేటింగ్స్ నమోదు అవ్వటమే కాకుండా ఆహాకు సబ్ స్రైబర్క్ ను కూడా పెరిగారు.ఇప్పటికే ఈ షో రెండు సీజన్లు పూర్తి అయింది.

అయితే మరొకసారి బాలయ్య ఓటిటిలో అభిమానుల్ని సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బాలయ్యతో కలిసి మరోసారి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసేందుకు ఆహా సిద్దమైంది.ఆహాలో ఇప్పటికే ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియల్ ఐడల్’(Indian Idol) ప్రసారమైంది.ఆహాలో ప్రసారమైన ఈ సింగింగ్ షో కి మంచి గుర్తింపు లభించింది.ఈ క్రమంలో ఈ సింగింగ్ షో సీజన్ 2 కూడా ప్రారంభించే పనిలో ఆహా బిజీగా ఉంది.త్వరలోనే ‘ఇండియన్ ఐడల్ ‘ సీజన్ 2 కూడా ప్రారంభం కాబోతుంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన ఆడిషన్స్ జరుపగా మొత్తం 12 మంది కంటెస్టెంట్లు సెలెక్ట్ అయ్యారు.

సెలెక్ట్ అయిన ఈ 12 మంది కంటెస్టెంట్ల మధ్య పోటీ ఉండనుంది.ఈ ఆడిషన్స్ ని థమన్, గీతామాధురి, కార్తీక్ నిర్వహించారు.అయితే ఇండియన్ ఐడల్ సీజన్ 2 ని బాలయ్యతో ప్రారంభించేందుకు ఆహా ప్లాన్ వేసింది.

ఈ 12 మందిని తెరకు పరిచయం చేసే బాధ్యతను బాలకృష్ణకు అప్పగించింది.ఇటీవల దానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది.ప్రస్తుతం ఇండియన్ ఐడల్ సీజన్ 2 కి సంబంధించిన వీడియోను ఆహా ట్విట్టర్ లో షేర్ చేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలయ్య మరొకసారి ఆహా వేదికపై సందడి చేయబోతున్నాడు అని తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య ఎంటర్ అయితే అన్ స్టాపబుల్ అలాగే ఇండియన్ ఐడల్ కూడా దద్దరిల్లి పోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube