హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం నియోజకవర్గంలో పలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో వాహనంపై నిలబడి అభిమానులకు మరియు కార్యకర్తలకు బాలకృష్ణ అభిమానం చేస్తుండగా ఒక్కసారిగా వాహనం కదిలింది.
దీంతో నిలబడ్డ బాలయ్య ఒక్కసారిగా వెనక్కి పడ్డారు.ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అప్రమత్తం కావడంతో బాలయ్యకు ఎటువంటి దెబ్బ ప్రమాదం వాటిలలేదు.
పడిపోతున్న సమయంలో అదే వాహనంపై ఉన్న ఇతర నేతలు ఆయనను పట్టుకోవడం జరిగింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.హిందూపురం బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు మరియు నాయకులు భారీగా తరలివచ్చారు.ఇదిలా ఉంటే హిందూపురం పర్యటనలో భాగంగా అక్కినేని తోక్కినేని కామెంట్లపై …బాలకృష్ణ వివరణ ఇవ్వటం జరిగింది.
అక్కినేని నాగేశ్వరరావుకీ నేనంటే ఎంతో ఇష్టం.నేను ఆయనను బాబాయ్ అని పిలుస్తాను.నన్ను ఎంతగానో ఆప్యాయంగా ఆయన ఇంటిలో ఉన్న పిల్లలకంటే చూసుకునేవారు.అటువంటు ఆయనను నేను అగౌరవ పరచ లేదు అని వివరణ ఇచ్చారు.ఇదే సమయంలో లోకేష్… పాదయాత్రలో మొదటి రోజు జాయిన్ అవుతా.ఆ తర్వాత అడపాదడపా మధ్య మధ్యలో.
జాయిన్ అవుతానని బాలకృష్ణ తెలియజేశారు.