కాకినాడ జిల్లా: పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, పాదగయ క్షేత్రాలలో హోమాలు, పూజలు నిర్వహించిన సిని దర్శకులు కొరటాల శివ దంపతులు, హరీష్ శంకర్ దంపతులు. దత్తాత్రేయుడి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దత్త ప్రచారకులు నారాయణ దత్త ఆధ్వర్యంలో పాదగయ క్షేత్రంలో ప్రత్యేక హోమం నిర్వహించిన దర్శకులు.
అనంతరం కుక్కుటేశ్వర స్వామిని, పదవ శక్తిపీఠం పురూహుతికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు.
ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు ఆహ్వానం మేరకు తన స్వగ్రామం వచ్చి దత్తాత్రేయుడి ఆవిర్భావ దినోత్సవాలలో పాల్గొనే అవకాశం వచ్చింది.దత్తాత్రేయుడి జన్మస్థలం పిఠాపురం రావాలని ఎప్పటి నుండో అనుకున్నాను,ఇన్నాళ్లకు దర్శన భాగ్యం కలిగింది.మేమంతా త్వరలో తీయబోయే సినిమాలన్నీ విజయవంతం కావాలని కోరుకోవటం జరిగిందని తెలిపిన దర్శకుడు హరీష్ శంకర్.