Narasimha Naidu: మొట్ట మొదటి సారి క్యూ తట్టుకోలేక కౌంటర్ లో కాకుండా థియేటర్ లో టికెట్స్ ఇచ్చిన సినిమా ఇదే !

ఏదైనా సినిమా విడుదల అవుతుంది అంటే టికెట్స్ ఎలా కొంటాం చెప్పండి కుదిరితే ఆన్లైన్లో బుక్ చేస్తాను లేదంటే థియేటర్ ముందు ఉన్న కౌంటర్లో టికెట్లు కొనుక్కుంటాం కానీ ఈ రెండు పద్ధతులు కాకుండా మొట్టమొదటిసారి థియేటర్ లోపల కూర్చోబెట్టి టికెట్లు ఇచ్చిన సినిమా బాలకృష్ణ ( Balakrishna ) నటించిన నరసింహనాయుడు.( Narasimha Naidu ) ఇది అప్పట్లో సంచలన విజయం సాధించింది ఎంతలా అంటే సినిమా రిలీజ్ అవుతే థియేటర్ల ముందు క్రౌడ్ తట్టుకోలేక ఆ క్యూలో జనాలు నిలబడితే ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందో అని భయపడి టికెట్స్ థియేటర్ లోపల సీట్స్ లో కూర్చున్న వారికి ఇచ్చారు.అంతటి పెను ప్రభంజనం సృష్టించింది నరసింహనాయుడు.

 Balakrishna Narasimha Naidu Releasing On June 10th-TeluguStop.com
Telugu Balakrishna, Balayya Babu, Balayya, Deviputrudu, Gopal, Mrugaraju, Simha-

బి.గోపాల్ దర్శకత్వంలో( Director B Gopal ) వచ్చిన ఈ చిత్రం 2001లో విడుదల అయింది.ఈ సినిమా విజయానికి ముఖ్యమైన కారణం మని శర్మ అందించిన BGM అనే చెప్పాలి ఈ చిత్రాన్ని ఎవరెస్టు శిఖరం అంత ఎత్తును మణిశర్మ సంగీతం నిలబెట్టింది.

సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాతో పాటు చిరంజీవి నటించిన మృగరాజు, వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు వంటి చిత్రాలను దాటి ఇండస్ట్రీ హిట్టుగా నిలబడింది.దాదాపు 75 సెంటర్లలో వంద రోజులు జరుపుకున్న నరసింహనాయుడు సినిమా ఫ్యాక్షన్ చిత్రాలకు ఒక మూలవిరాట్ వంటిది ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత దాదాపు ఐదేళ్లపాటు ఫ్యాక్షని సినిమాలే ఇండస్ట్రీ నీ ఏలాయి.

Telugu Balakrishna, Balayya Babu, Balayya, Deviputrudu, Gopal, Mrugaraju, Simha-

ముఖ్యంగా ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ అద్భుతంగా పండడంతో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.ఇక జూన్ 10వ తారీఖున బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 20 సంవత్సరాల క్రితం వచ్చిన నరసింహనాయుడు చిత్రాన్ని ఫోర్ కేలో మళ్లీ విడుదల చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు ఈ విషయం తెలిసిన బాలకృష్ణ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ సినిమా ద్వారా వచ్చే కలెక్షన్స్ ని పూర్తిగా సేవా కార్యక్రమాల కోసమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారట.మరి మొదటి సారి విడుదల చేసినప్పుడు సృష్టించిన కలెక్షన్స్ సునామి ఈ రెండో విడుదల లో జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube