శ్రీ లీల టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికిన అదృష్టం... బాలయ్య కామెంట్స్ వైరల్!

నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) తాజాగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా దసరా పండుగను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 Balakrishna Interesting Comments About Sreeleela At Bhagavanth Kesari Success Me-TeluguStop.com

ఇక ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించగా శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.ఇక ఈ సినిమా ఒక తండ్రి కూతురి నేపథ్యంలో కొనసాగుతూ వారి మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలను తెలియజేస్తుంది.

వీర సింహారెడ్డి సినిమా తర్వాత అదే స్థాయిలో భగవంత్ కేసరి సినిమా ద్వారా బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.

Telugu Balakrishna, Sreeleela, Tollywood-Movie

ఇక ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది ఇక ఈ సినిమా ఇంత మంచి విజయ అందుకోవడంతో తాజాగా చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఇక ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ.

భగవంత్ కేసరి చిత్ర బృందంపై ప్రశంసల కురిపించారు.అనిల్ రావిపూడి డైరెక్షన్ గురించి మాట్లాడుతూ అద్భుతమైన కథనంతో సినిమాని మరో లెవెల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని ఈయన ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే వ్యక్తిత్వమని తెలియజేశారు.

Telugu Balakrishna, Sreeleela, Tollywood-Movie

ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి చెప్పాల్సిన పనిలేదు మా కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు ఈయన అందించిన బిజీఏంతో ఊఫర్లు కూడా పేలిపోయాయనీ బాలయ్య మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై ప్రశంశలు కురిపించారు.ఇక కాజాల అగర్వాల్ తన నటనతో ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమె కొంత విరామం తర్వాత మా సినిమా ద్వారా ప్రేక్షకులను తన స్టైల్ లో సందడి చేశారని తెలిపారు.శ్రీ లీల( Sreeleela ) గురించి మాట్లాడుతూ.చిలిపి, గ్లామర్ రోల్స్, డాన్సులతో అలరిస్తున్న శ్రీలీల ఇలాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేయడం గొప్ప విషయం.శ్రీలీల అద్భుతంగా నటించింది.శ్రీలీల టాలీవుడ్ కి దొరికిన అదృష్టం అంటూ బాలకృష్ణ శ్రీ లీల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube