బాలయ్య గోపీచంద్ మూవీ స్టోరీలైన్ ఇదేనా.. టైటిల్ కూడా ఫిక్స్ అంటూ?

స్టార్ హీరో బాలకృష్ణకు క్లాస్ సినిమాలతో పోలిస్తే మాస్ సినిమాలే మంచి ఫలితాలు ఇస్తున్నాయి.

ఊరమాస్ కథాంశంతో తెరకెక్కిన అఖండ మూవీ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు గతంలో జై బాలయ్య అనే టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం జరగగా ప్రస్తుతం ఈ సినిమాకు పెద్దాయన అనే టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.మరోవైపు ఈ సినిమా స్టోరీ లైన్ కు సంబంధించి కూడా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

వైరల్ అవుతున్న వార్తల ప్రకారం బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.బాలయ్య ఒక పాత్రలో యంగ్ గా కనిపిస్తారని మరో పాత్రలో వృద్ధుడిగా కనిపిస్తారని తెలుస్తోంది.రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ జరుగుతుందని సమాచారం.60 ఏళ్ల వృద్ధుడి పాత్ర పోషిస్తున్న బాలయ్యను పెద్దాయన అని పిలుస్తారని సమాచారం.బాలయ్యకు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా కన్నడ నటుడు దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ గా ఫిక్స్ అయ్యారు.

ఒక రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించాలని అనుకున్న పారిశ్రామికవేత్తలు కొన్ని కారణాల వల్ల ఆ విషయంలో వెనక్కు తగ్గుతూ ఉంటారు.ఆ సమస్యలను బాలయ్య పరిష్కరించి ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా మేలు చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

Advertisement

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రకు ఎంపికయ్యారు.త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది.ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య నటించిన పలు సినిమాలు విజయాలను సొంతం చేసుకున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు