టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో రాఘవేందర్రావు ( Directors Raghavendra Rao )తొలి వరుసలో ఉంటాడనడంలో సందేహం లేదు.ప్రేక్షకులకు నచ్చేలా హీరోలను ప్రజెంట్ చేయడం, ఇంట్రడక్షన్లను ప్లాన్ చేయడం రాఘవేంద్రరావుకి వెన్నతో పెట్టిన విద్య.
అందుకే ఈ డైరెక్టర్ తీసే సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.ప్రేక్షకుల చేత ఈలలు కూడా వేయించాయి.
అయితే బాలకృష్ణ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవాలనే ఆశతో రాఘవేంద్రరావుతో కలిసి ఏడు సినిమాలు తీశాడు.కానీ ఒక్కసారి కూడా బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకోలేదు.
ఆయనతో కలిసి చేసిన సినిమాలన్నీ యావరేజ్, లేదంటే మామూలు హిట్స్‌గా మాత్రమే మిగిలిపోయాయి.
బాలయ్య బాబు( Balayya Babu ), రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో మొదటగా వచ్చిన సినిమా ‘రౌడీ రాముడు కొంటెకృష్ణుడు ( 1980 )’.ఇందులో రౌడీరాముడుగా సీనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేయగా… కొంటెకృష్ణుడుగా బాలయ్య మెరిశాడు.శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయగా, బాలకృష్ణతో రాజ్యలక్ష్మీ జతకట్టింది.
ఈ మూవీకి ఫస్ట్ డే కలెక్షన్లు బాగానే వచ్చాయి కానీ ఎక్కువ రోజులు ఇది రన్ కాలేకపోయింది.దానివల్ల యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది.

మళ్లీ 1985లో రిలీజ్ అయిన ‘పట్టాభిషేకం’ సినిమా( Pattabhishekam ) కోసం రాఘవేంద్రరావుతో చేతులు కలిపాడు బాలకృష్ణ.కె.రాఘవేంద్రరావు బాలకృష్ణను సోలో హీరోగా పెట్టి తీసిన తొలి సినిమా ఇదే.ఇందులో విజయశాంతి ఫిమేల్ లీడ్ రోల్ చేసింది.ఇది ఫస్ట్ వీక్‌లో రూ.96 లక్షలకు పైగా కలెక్షన్లను రాబట్టింది, ఆ సమయంలో ఈ ఓపెనింగ్ కలెక్షన్ చాలా ఎక్కువ.అయితే ఫస్ట్ వీక్ తర్వాత పట్టాభిషేకం సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది.దానివల్ల జస్ట్ హిట్‌గా మాత్రమే నిలిచింది.1986లో వీరి కాంబినేషన్‌లో ‘అపూర్వ సహోదరులు’ వచ్చింది.ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశాడు.
విజయశాంతి, భానుప్రియ అతడికి జంటగా నటించారు.ఫస్ట్ వీక్‌లో రూ.80 లక్షలకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఆ తర్వాత పెద్దగా కలెక్ట్ చేయలేక మామూలుగా నిలిచింది.

బాలయ్య, రాఘవేంద్రరావు కలిసి 1987లో ‘సాహస సామ్రాట్’ మూవీ( ‘Sahasa Samrat’ ) చేశారు.విజయశాంతి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది.వీరిద్దరి కాంబినేషన్‌లో ఐదో సినిమాగా ‘దొంగరాముడు (1988)’ వచ్చింది.
రాధ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది.దీని తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని మళ్లీ రాఘవేందర్రావుతో బాలకృష్ణ కలిసి ‘అశ్వమేధం (1992)’ సినిమా చేశాడు.
ఇందులో నగ్మా, మీనా హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేశారు.భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కూడా దారుణంగా ఫెయిల్ అయ్యింది.
వీరి కాంబినేషన్‌లో చివరిసారిగా వచ్చిన సినిమా ‘పాండురంగడు’.ఇదీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు.