అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం: బాలకృష్ణ

అసెంబ్లీలో పరిణామాలపై బాలకృష్ణ స్పందన ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకోవడం సరికాదు మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో లేదీ ప్రభుత్వం.మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం.

 Balakrishna Comments Abou Assembly Incident, Ap Potics , Chandrababu , Aseembly-TeluguStop.com

మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు చంద్రబాబుపై ఎన్నోవిధాలుగా దాడులకు ప్రయత్నించినా ఆయన సంయమనంతో ఉన్నారు ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదు ఆడవాళ్లను తెరపైకి తెచ్చి రాజకీయాల్లో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారు.మీకు దాసోహం చేసేలా చేసుకోవడం మంచిది కాదు.

అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం.సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది.ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదు.అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆనవాయితే ప్రజాసమస్యలపై పోరాడటమే అసెంబ్లీ వేదికగా ఉండేది.

అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండా తీసుకొచ్చారు.వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారు.

నా సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం అసెంబ్లీలో ఉన్నామో.పశువుల కొంపలో ఉన్నామో అర్థం కాలేదు.

అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు.హేళన చేయవద్దు.

కొత్త నీచ సంస్కృతికి తెరలేపారు.ఆ పార్టీలోనూ బాధపడే వారున్నారు.

ఏకపక్షంగా సభను నడుపుతున్నారు.రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలంతా గమనిస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube