బన్నీకి బాలయ్య 100వ మూవీ టైటిల్‌

మెగా హీరో అల్లు అర్జున్‌ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమా తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నాడు.

భారీ అంచనాలున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులతో పాటు, ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలున్నాయి.‘లెజెండ్‌’ వంటి లెంజెండరీ సక్సెస్‌ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇదే కావడం విశేషం.

ఇక ఈ సినిమాకు పలు రకాల టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి.మొదట ఈ సినిమాకు ‘రధం’ అని అంతా అనుకున్నారు.

కాని తాజాగా ఒక కొత్త పవర్‌ ఫుల్‌ టైటిల్‌ ప్రచారంలోకి వచ్చింది.ఆమధ్య బాలకృష్ణ 100వ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని, ఆ సినిమాకు ‘చరిత్రకు ఒక్కడు’ అనే టైటిల్‌ను పెట్టే అవకాశాలున్నాయి అంటూ ప్రచారం జరిగింది.

Advertisement

అయితే కొన్ని కారణాల వల్ల ‘చరిత్రకు ఒక్కడు’ టైటిల్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న సినిమాకు బోయపాటి ఎంపిక చేసినట్లుగా ఫిల్మ్‌ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.చరిత్రకు ఒక్కడు టైటిల్‌ బన్నీకి సరిగ్గా సూట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో బోయపాటి ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

అయితే మెగా ఫ్యాన్స్‌ మాత్రం ఈ వార్తలో నిజం లేదని తేలికగా తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు