తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు బాలచందర్…ఈయన చేసిన ప్రతి సినిమా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించేది.ఇక తెలుగులో ఈయన చిరంజీవితో ‘రుద్రవీణ( Rudraveena) ‘ అనే సినిమా చేశాడు.
ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా చిరంజీవికి నటుడుగా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది.అయితే ఇలాంటి ఒక దిగ్గజ దర్శకుడు 4 లెజెండరీ ఆర్టిస్ట్ లని ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు.
వాళ్లెవరు అంటే తమిళ్ ఇండస్ట్రీలో తలైవాగా పేరుపొందిన సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) కి మొదటి అవకాశాన్ని ఇచ్చి మరి తనని ఎంకరేజ్ చేశాడు.

ఇక ఈరోజు ఆయన సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటున్నాడు.ఇక ఈయనతో పాటుగా కమలహాసన్, ప్రకాష్ రాజ్, నాజర్ లాంటి నటులను ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఒక మంచి ప్రయత్నం అయితే చేశాడు.ఇక రజనీకాంత్, కమలహాసన్ లు హీరోలుగా సక్సెస్ అయితే ప్రకాష్ రాజ్, నాజర్ లు మాత్రం ఇండస్ట్రీలో మంచి నటులుగా వెలుగొందుతున్నారు.
ఒక భాషలో అని కాకుండా వీళ్ళు అన్ని భాషల్లో నటిస్తూ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతున్నారు.ఇక తెలుగులో అయితే నాజర్, ప్రకాష్ రాజ్ ఇద్దరు వరుసగా చాలా సినిమాల్లో నటించిన కాకుండా మంచి పేర్లు కూడా సంపాదించుకున్నారు.వాళ్ల కోసమే దర్శకుడు ప్రత్యేకమైన క్యారెక్టర్లను సృష్టిస్తున్నారంటే వాళ్లు ఎలాంటి నటులో మనం అర్థం చేసుకోవచ్చు…

ఇక ఇప్పుడు తెలుగులో వాళ్ళు చాలా కీలకమైన నటులుగా మారిపోయారు…ఆయన లాగా ఇప్పుడున్న డైరెక్టర్స్ కూడా మంచి యాక్టర్స్ ను ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి కూడా లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారని చాలా మంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
.







