అజ్మీర్ రకం మేక.. ధర రూ. లక్ష !

ముస్లింలు జరుపుకునే పండుగల్లో బక్రీద్ ఒక్కటి.ఈ పండగ వస్తే ఈ సీజ‌న్‌లో మేక‌ల‌కు, పొటేళ్ల‌కు బాగా డిమాండ్ ఉంటుంది.

ఈ ఫెస్టివల్ కోసం ప్ర‌త్యేకంగా మేక‌లు, పొటేళ్ల‌ను సిద్ధం చేసి మార్కెట్‌లోకి తీసుకువ‌స్తారు.అయితే దేశంలో కరోనా విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే కరోనా వలన ఈసారి బ‌క్రీద్ మార్కెట్‌ను దెబ్బ కొట్టింది.కరోనా కారణంగా ముంబై లాంటి న‌గ‌రాల్లో ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయని సమాచారం.

ఇక హైద‌రాబాద్ జంట‌ న‌రాల్లోనూ కాస్త డిమాండ్ త‌గ్గింద‌ని తెలియజేస్తున్నారు.అయితే, సికింద్రాబాద్‌లో అజ్మీర్ ర‌కం మేక‌లు ధర ఏకంగా రూ.ల‌క్ష‌లు ప‌లుకుతున్నాయని సమాచారం.అయితే బక్రీద్ కోసం ప్ర‌త్యేకంగా అజ్మీర్ రకం మేకలును తెప్పించారు వ్యాపారులు.

Advertisement

ఈరోజు ఒక్కో మేక ల‌క్ష రూపాయ‌లు ప‌లికిన‌ట్టు తెలిపారు.అందుకు కారణం ఈ మేక బరువు దాదాపు 100 కిలోల వ‌ర‌కు ఉంటుంద‌ని వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు.

ఇక వంద కిలోల‌కు పైగా అయితే.రెండు, మూడు ల‌క్ష‌లు కూడా ప‌లికిన సంద‌ర్భాలు ఉన్నాయని వారు తెలియజేశారు.

అయితే ఈ మేకలు బలిష్టంగా, ఆకట్టుకునేలా ఉండడంతో కొనుగోలుదారుల చూపులను ఆకర్షిస్తున్నాయి.దీంతో కొనుగోలుదారులు మేకలకు ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడడం లేదు.

వ్యాపారస్తులు వీటికి రోజుకు కిలో తెల్ల శనగలు, ఓ లీటర్ పాలు, రకరకాల కూరగాయలు, ఆకుకూరలను తినిపిస్తార‌ని తెలిపారు.వీటికి ఎటువంటి రసాయనాలు కలవని ఆహార ఇవ్వ‌డం వ‌ల్ల ఇవి ఆరోగ్యంగా, బలిష్టంగా ఉంటాయని వ్యాపారస్తులు తెలిపారు.

పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు