భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా ఎంతలా ఉందో అందరికీ తెలిసిందే.అయితే భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని తగ్గించడంతో ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం కాస్త తగ్గింది.
దీంతో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్( Bajaj ) చౌకైన ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత మార్కెట్లో లాంచ్ చేయాలని యోచిస్తోంది.ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయలేనివారు తక్కువ ధరలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్( Chetak Electric Scooter ) కొనుగోలు చేయడం బెస్ట్ ఆప్షన్.
త్వరలోనే స్టీల్ బాడితో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
బజాజ్ ఆటో ఇప్పటికే చేతక్ బ్రాండ్ పేరుతో చేతక్ ఆర్బన్,( Chetak Urban ) చేతక్ ప్రీమియం( Chetak Premium ) అనే రెండు వేరియంట్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది.ఇక చేతక్ చౌక వెర్షన్ ను చిన్న బ్యాటరీ బ్యాక్ తో ప్రారంభించనుంది.ఇందులో హబ్-మౌంటెడ్ మోటర్ ను ఉపయోగిస్తుంది.
ప్రస్తుతం దేశంలో 164 నాలుగు నగరాలలో దాదాపుగా 200 బజాజ్ స్టోర్ లు అందుబాటులో ఉన్నాయి.త్వరలోనే ఆ స్టోర్ల సంఖ్య 600కు చేరే అవకాశం ఉంది.
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ల గురించి మాట్లాడితే, చేతక్ చౌకైన మోడళ్లకు ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే అవే ఫీచర్లను అందించవచ్చు.
చేతక్ చౌకైన వేరియంట్ మేలో ప్రారంభించనుంది.ఆ లాంచ్ ఈవెంట్ లో చేతక్ ధరను కంపెనీ వెల్లడించనుంది.బజాజ్ ప్రస్తుత చేతక్ అర్బన్ ఎక్స్ షోరూం ధర రూ.1.23 లక్షలు. చేతక్ ప్రీమియం ఎక్స్ షోరూం ధర రూ.1.47 లక్షలు.మేలో స్టీల్ బాడీ తో వచ్చే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లతోపాటు ధర వివరాలను కంపెనీ వెల్లడించనుంది.