సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన కిడాంబి శ్రీకాంత్, షేక్‌ జాఫ్రిన్‌

అమరావతి: భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్‌. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన కిడాంబి శ్రీకాంత్, షేక్‌ జాఫ్రిన్‌.

 Badminton Player Kidambi Srikanth Shaik Jafrin Met Cm Jagan In Sachivalayam Deta-TeluguStop.com

ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను ప్రశంసించిన సీఎం వైఎస్‌ జగన్‌.బదిరుల ఒలంపిక్‌ క్రీడల్లో (డెఫిలింపిక్స్‌–2022) కర్నూలుకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ కాంస్య పతకం సాధించారు.

అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను వెలుగెత్తిచాటడంపై జాఫ్రిన్‌ను ప్రశంసించిన సీఎం వైఎస్‌ జగన్‌.

షేక్‌ జాఫ్రిన్‌ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటిన ఏపీ క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని ఆదేశాలు.

శ్రీకాంత్, జాఫ్రిన్‌ను ఘనంగా సన్మానించిన సీఎం వైఎస్‌ జగన్.ప్రభుత్వం తరపున వారికవసరమైన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని సీఎంవో అధికారులకు సూచించిన సీఎం వైఎస్‌ జగన్‌.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్న సీఎం.రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్న సీఎం.

ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ తరపున సీఎం వైఎస్‌ జగన్‌కు బ్యాడ్మింటన్‌ కిట్‌ అందజేసిన ఏపీబీఏ ప్రెసిడెంట్‌ ముక్కాల ద్వారకానాథ్‌.ఈ కార్యక్రమంలో పాల్గొన్న టూరిజం, క్రీడలశాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌ కృష్ణ, షేక్‌ జాఫ్రిన్‌ తండ్రి షేక్‌ జకీర్‌ అహ్మద్, శాప్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ జూన్‌ గ్యాలియట్, శాప్‌ సిబ్బంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube