Ravi Teja : పాపం రవితేజకు ఇంత బ్యాడ్ టైం నడుస్తుంది ఏంటి ?

రవితేజకు( Ravi Teja ) ఓవర్ బడ్జెట్ శాపంగా మారుతుందా ? లేదా దర్శక నిర్మాతలు అతని మాస్ హీరోగా చూపించడంలో, క్రేజ్ ని వాడుకోవడం లో విఫలమవుతున్నారా మరి కాదంటే కథల ఎంపికలు లోపాలు జరుగుతున్నాయా? ఎందుకు రవితేజ సినిమాలు పరాజయం పాలవుతున్నాయి.

అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది.

దాదాపు ఒక పదేళ్ల కెరియర్ వెనక్కి వెళితే మిరపకాయ సినిమా తర్వాత హిట్ కొట్టడానికి 2017 వరకు వేస్ట్ చూడాల్సి వచ్చింది.మిరపకాయ్ సినిమా తర్వాత రాజా ది గ్రేట్( Raja The Great ) అతనికి మళ్ళీ ఊపిరి పోయగా 2021 లో క్రాక్ సినిమాతో మరో హిట్టు దక్కింది.2022లో ధమాకా చిత్రం( Dhamaka ) అతడి చివరి విజయవంతమైన చిత్రం.2011 నుంచి 2024 వరకు దాదాపు 28 సినిమాలతో తెలుగు తెరపై దండయాత్ర చేయగా దక్కినవి కేవలం నాలుగు అంటే నాలుగు విజయాలు.

మరి పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే రవితేజ గత మూడు చిత్రాలు రావణాసుర,( Raavanasura ) టైగర్ నాగేశ్వరరావు,( Tiger Nageswara Rao ) ఈగల్( Eagle Movie ) చిత్రాలు పూర్తిగా ఓవర్ బడ్జెట్ కారణంగానే గట్టెక్కడంలో విఫలమయ్యాయి.ఇక వాల్తేరు వీరయ్య సినిమా విజయవంతమైన అది పూర్తిగా చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది.ఇప్పుడు మిస్టర్ బచ్చన్( Mr.Bachchan Movie ) సినిమాపై అనేక అనుమానాలు ఆయన అభిమానుల్లో రేకెత్తుతున్నాయి.గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ వంటి ఒకరిద్దరు దర్శకులను మినహాయిస్తే అతనికి విజయాన్ని ఇవ్వడంలో అందరూ విఫలమవుతున్నారు.

అతనిలోని మాస్ క్రేజ్ ప్రేక్షకులకు పరిచయం చేయడంలో వెనకబడుతున్నారు.అందుకే వరుస పరాజయాలు అతనిని పలకరిస్తున్నాయి.

Advertisement

ఇక తను గోపీచంద్ తో తీయాల్సిన సినిమా కూడా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనే కారణంతోనే పట్టాలు తప్పింది.దానితో ఆ సినిమా ఆగిపోయింది.అంతేకాదు ఓటిటి కూడా రవితేజ సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఈగల్ సినిమా విషయంలో ఇదే జరిగింది కూడా.రవితేజ రెమ్యునరేషన్ కూడా ఏ మాత్రం తగ్గించుకోవడానికి ఇష్టపడటం లేదు.

అందుకే కాస్త బడ్జెట్ కూడా పెరిగిపోతుంది.హరీష్ శంకర్( Harish Shankar ) గతంలో మిరపకాయ సినిమాకు దర్శకత్వం వహించాడు.

రవితేజతో మరోసారి మిస్టర్ బచ్చన్ అనే సినిమా తీస్తున్నాడు.ఇన్ని ప్రతికూలతల నడుమ ఈ సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు