జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.పవన్ కల్యాణ్ ది తిక్క లెక్కని చెప్పారు.
సీఎం సీఎం అని గొంతు చించుకున్న కాపులకు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) షాక్ ఇచ్చారని తెలిపారు.

పవన్ కనీసం తన సీటును కూడా ప్రకటించుకోలేదని ఎద్దేవా చేశారు.పొత్తుపై టీడీపీ – జనసేన( TDP , Janasena )కు క్లారిటీ లేదన్నారు.చంద్రబాబు, పవన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారన్న మంత్రి అంబటి సీఎం అవుతానన్న పవన్ 24 సీట్లకే పరిమితం అయ్యారని విమర్శించారు.
జనసేన కార్యకర్తల మనో భావాలను పవన్ దెబ్బతీశారని వెల్లడించారు.







