అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు బాగా పెరుగుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.మనదేశంలోని ముడి చమురు అవసరాలలో 100% విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాము.
ఇలాంటి పరిస్థితిలలో అంతర్జాతీయ మార్కెట్ల ధరల పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధర భారీగా పెరిగింది.ఇక అసలు విషయంలోకి వెళితే.
తాజాగా సామాన్యులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.జూలై 01, 2021 నుండి ఎల్‌పిజి గ్యాస్ ధరలు పెరిగాయి.ఇంట్లో ఉపయోగించే ఎల్‌పిజి సిలిండర్లపై రూ.25.50 పెంచాయి ప్రభుత్వ చమురు కంపెనీలు.ఈ దెబ్బతో ఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.834.50, కోల్‌కత్తలో రూ.861, ముంబై లో రూ.884.5 కు చేరుకుంది.
జనవరి 2021లో ఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.694 కాగా ఫిబ్రవరి నెలలో సిలిండర్‌కు రూ.719కు పెంచారు ప్రభుత్వ చమురు కంపెనీలు.ఆ తర్వాత మళ్లీ ఫిబ్రవరి 15న ధరలను మరోసారి పెంచారు ప్రభుత్వ చమురు కంపెనీలు.ఆ తర్వాత ఇది రూ.769 రూపాయలకు చేరుకోగా.ఫిబ్రవరి 25 న ఎల్పిజి సిలిండర్ల ధర మరోసారి పెంచగా అది కాస్తా ధర రూ.794 చేరుకుంది.ఆ తదుపరి మళ్లీ మార్చి నెలలో మరోసారి పెంచగా ఒక సిలిండర్ ధర రూ.819 కు చేరుకుంది.

మాములుగా ఎల్‌పిజి సిలిండర్ల ధరలు సగటు అంతర్జాతీయ బెంచ్ మార్క్ రేటు అలాగే విదేశీ కరెన్సీ మార్పిడి రేటు ప్రకారం మారుతూ ఉంటాయి.ఈ కారణంతోనే ప్రతి నెల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర మారుతుంది.అంతర్జాతీయంగా మార్కెట్లో ధరలు పెరిగిన సమయంలో ప్రభుత్వం ఎక్కువ రాయితీలు ఇస్తుంది.
అలాగే రేట్లు తగ్గిన సమయంలో సబ్సిడీ తగ్గించబడుతుంది.ఇలా పన్ను నిబంధనల ప్రకారం ఇంధన మార్కెట్ ధరపై ఎల్‌పిజిపై వస్తు, సేవల పన్ను కూడా ఆధారపడతాయి.