బాబుతో బాబూమోహన్ .. టీడీపీ లో చేరుతున్నట్టే ?

ప్రముఖ సినీ కమెడియన్ , మాజీ మంత్రి బాబు మోహన్( Babu Mohan ) త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి .

ప్రస్తుతం రాజకీయంగా అయోమయ పరిస్థితిలో ఉన్న బాబు మోహన్ తాను రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలోనే మళ్లీ చేరాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

రెండు రోజుల క్రితమే హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగగా,  అక్కడ కు బాబు మోహన్ వచ్చారు .ఈ సందర్భంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు.ఈ సమయంలోనే బాబు మోహన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని వీడిపోవడం వల్లే ఇబ్బందులు ఎదుర్కొన్నానని , తనకు అవకాశం ఇస్తే మళ్లీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం.

  ఇక బాబు మోహన్ ను చేర్చుకునే విషయంలో చంద్రబాబు కూడా ఆసక్తిగానే ఉన్నారట.  దీంతో త్వరలోనే తెలుగుదేశం పార్టీలో బాబు మోహన్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇటీవల కేఏ పాల్ ( K.A.Paul )కు చెందిన ప్రజాశాంతి పార్టీతో సన్నిహితంగా బాబు మోహన్ మెలిగారు.  అప్పట్లో ఆ పార్టీ కండువా కూడా కప్పుకున్నారు.

Advertisement

అయితే తాను ప్రజాశాంతి పార్టీలో చేరలేదని,  తనతో ఉన్న చనువు వల్ల కేఏ పాల్ తన మెడలో కండువా వేశారని,  కానీ ఆ పార్టీలో చేరలేదని బాబు మోహన్ ప్రకటించారు.చంద్రబాబును కలవడంతో ఆయన టిడిపిలో చేరబోతున్నారనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది.

  వాస్తవంగా టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణలోనూ టిడిపిని బలోపేతం చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఈ మేరకు అక్కడ పార్టీ నేతలు అందరిని యాక్టివ్ చేయడంతో పాటు,  క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం , చేరికలను ప్రోత్సహించడం వంటివి మొదలుపెట్టారు.  ఈ క్రమంలోనే బాబు మోహన్ ను చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నారట.బీఆర్ఎస్ , బిజెపి( BRS, BJP ) నుంచి బయటకు వచ్చిన బాబు మోహన్ కాంగ్రెస్ లో కి వెళ్లే ఛాన్స్ లేదు.

దీంతో మిగిలిన ఏకైక ఆప్షన్ గా తెలుగుదేశం పార్టీనే కనిపిస్తోంది.అది కూడా తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ కావడంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశంలో చేరితేనే తనకు తగిన గుర్తింపు వస్తుందని బాబు మోహన్ భావిస్తున్నారట.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు