వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చి వైసీపీని ఓడించాలి అనే పట్టుదలతో ఉన్నారు టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ).ఇప్పటికే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) యువగళం పాదయాత్ర ద్వారా, జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తుండగా , చంద్రబాబు నియోజకవర్గల వారీగా పర్యటనలు చేస్తూ, పార్టీ నేతల్లో ఉత్సాహం పెరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇక ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే సంకేతాలతో బాబు ఏపీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గల( Assembly constituencies ) పైన ప్రత్యేకంగా దృష్టి సారించి , నియోజకవర్గాల వారీగా కీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.ప్రతి నియోజకవర్గం నుంచి కొంతమంది కీలక నేతలను ఆహ్వానిస్తూ, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, గెలుకోటముల పైన ఆరాతీస్తూ, అభ్యర్థుల ఎంపిక పైన సదరు నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

ఇప్పటికే పార్టీ ద్వారా చేపట్టిన సర్వే నివేదికలు, సొంత నివేదికలు, తాజా భేటీలో నాయకులు ఇస్తున్న ఫీడ్ బ్యాక్ వంటి అన్నిటిని బేరీజు వేసుకుని అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు నిర్ణయించుకున్నారు.ముఖ్యంగా నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది.పార్టీ క్యాడర్ కు , నాయకులకు మధ్య సమన్వయం ఉందా లేదా అనే విషయాల పైన ఆరాధిస్తున్నారు.ఈసారి కచ్చితంగా గెలిచే అవకాశం ఉందనుకున్న వారికి టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.
అలాగే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అనే సమాచారంతో, అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు చేపడుతూ, అభ్యర్థులు ఎంపిక పైన ప్రత్యేకం గా దృష్టి సారిస్తున్నారు.కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు.
మిగతా నియోజకవర్గాల్లోనూ ఎన్నికల సమయం కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి , ఎన్నికల ప్రచారానికి దిగే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

అలాగే జనసేన, బిజెపితో ( Jana Sena , BJP )పొత్తు కుదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఏ ఏ నియోజకవర్గాల్లో టికెట్లు కేటాయించాలనే విషయంపైన కసరత్తు చేస్తున్నారు.అలాగే వైసిపి ప్రభుత్వంపై ఏయే వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి అనే విషయం పైన దృష్టి సారిస్తున్నారు.అన్ని విషయాలపైన ఒక క్లారిటీకి వచ్చి ,వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా వ్యూహాత్మకంగా చంద్రబాబు ముందుకు వెళుతున్నారు.