పసుపు కుంకుమకు ఇచ్చిన ప్రాధాన్యత అభివ్రుదికి బాబు ఇవ్వలేదు

పసుపు కుంకుమకు ఇచ్చిన ప్రాధాన్యత అభివ్రుదికి బాబు ఇవ్వలేదు రెండుపార్టీలను పై బిజెపి రాష్ట్రఅద్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం ఇళ్లుకట్టరు, పోలవరం ప్రాజెక్టుపనులు జాప్యం, రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు బిజెపి కి అవకాశం ఇవ్వండి శరవేగంతో అభివ్రుద్ది చేస్తాం సోమువీర్రాజు.ప్రజాపోరు పరమార్థాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు.

 Babu Did Not Give The Preference Given To Yellow Saffron To Abhivrudi , Abhivrud-TeluguStop.com

రాజధానిలేని రాష్ట్రం గా మార్చిందెవరు, పోలవరం జాప్యానికి కారకులెవరు అనే ప్రశ్నలు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లడంతో పాటు కేంద్రం ప్రభుత్వం చేస్తున్న అభివ్రుద్ది విషయాలను తీసుకుని వెళ్లేవిధంగా బిజెపి ప్రజా పోరుద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు .రాష్ట్ర రాజధానిలో లాంఛనంగా ప్రజా పోరును బిజెపి రాష్ట్రఅధ్యక్షుడు సోమువీర్రాజు ప్రారంభించారు.రెండు కుటుంబ పార్టీలను లక్ష్యంగా వాక్భాణాలను సోము సంధించారురు.శివాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి పోరు సభను ప్రారంభించారు.ఈ సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రసంగాన్ని కొనసాగిస్తూ 26 జిల్లాల్లో ప్రజాపోరు సభలు ప్రారంభిస్తున్నాం.జిల్లాకు 50 చొప్పున సభలు నిర్వహిస్తాం.

సీఎం అయ్యాక ప్రజల్లో జగన్ కనిపించడం లేదు ఒక్క సందర్భంలో కూడా సీఎం సెక్రటేరియట్ లో కనిపించలేదు.అసెంబ్లీ ని అబద్ధాల వాణిగా మార్చేసారు.

ఎన్టీఆర్ ని పడగొట్టి న చంద్రబాబు కూడా దేశభక్తుడేనా.జగన్ దేశభక్తుడా.మల్లాది విష్ణు డైరెక్ట్ గా దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడాలి నియోజకవర్గంలో మోదీ ఏమిచ్చాడో…వెలంపల్లి కి మా పార్టీ తరఫున నిలబడి గెలిచే దమ్ముందా…పసుపు కుంకాలకు 35వేల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు, కేపిటల్ కట్టలేదు, పోలవరం కూడా కట్టలేదు.జగన్ వచ్చి రాజధానిలో సొంత ఇల్లు కట్టుకుని తాజాగా మూడు రాజధానులు అంటాడు.

ఇసుక అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో తక్కువ ధరకు దొరకదు.బంగారానికి లేని స్టాక్ పాయింట్లు ఇసుకకి ఎందుకు…ఇసుక, సిమెంటు రేట్లు పెరిగిపోయి నిర్మారంగం కుదేలైంది.

చంద్రబాబు ఇళ్ళకు కాకుండా పసుపు కుంకాలకు ఖర్చు పెట్టాడు.జగన్ ని నమ్మి డబ్బులిస్తే.

ఇంకా ఇళ్ళే పూర్తవలేదు‌.నిర్వాసితుల వివరాలివ్వకుండా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెపుతున్నాడు సీఎం జగన్ .సీఎం జగన్ ఆరోగ్యం పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రధాని మోదీ ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు ఇచ్చారు…ప్రధాని అన్నీ చేస్తే ఈ ప్రభుత్వం ఏం చేసింది.ఎయిమ్స్ ఆసుపత్రికి కరెంటు, నీళ్ళు ఇవ్వాలి.

ఇవ్వకపోతే సీఎం జగన్ ఇంటి ముందు కూచుంటాం.అంటూ తీవ్ర స్వరంతో సోము వీర్రాజు మండి పడ్డారు.8వేల కోట్లతో విజయవాడ సందు సందునా రోడ్లు వేయిస్తున్నది మోదీ.మోదీ కి ఓట్లు వేయకపోయినా మనకు అన్నీ ఇస్తున్నాడు…వాజపేయి గారి కార్యక్రమాలను సీఎం జగన్ తనవని చెప్పుకుంటాడుజగనన్న ఒడి, జగనన్న తడి, జగనన్న జడి… ఏంటండీ ఈ తడి, ఒడి, జడి…2024లో ఈ కుటుంబ పార్టీలు తరిమేస్తాం బిజెపి కుటుంబ పార్టీ కాదు.వాలంటిర్లను పేట్టి ఓట్లు వేయించుకుంటున్నారు .కేంద్ర పథకాలకు స్టిక్కర్ వేసుకుని జగనన్న ఒడి, జగనన్న తడి అంటున్నారు,జగన్ ఒక స్టిక్కర్ బాబు.2024లో రెండు కుటుంబ పార్టీలను రాష్ట్రంలో తరిమేస్తం .మల్లాది విష్ణు, వెల్లంపల్లి టివిల్లో డిబెట్లు కాదు దమ్ముంటే ధైర్యంగా మా దగ్గరికి రా….ఏం అభివృద్ధి చేశామో చెప్తాం… వచ్చే దమ్ము వుందా .అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెబుతున్నాడు.పోలవరం నిర్వాసితుల సర్వే చేయలేదు….సర్వే చేస్తే నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా వున్నంబిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ.ఎన్నికల ముందు జగన్ అనేక హామీలు ఇచ్చారు.మూడేళ్ళలో‌ వాటిని అమలు చేయకుండా మోసం చేశారు.

జగన్ ప్రభుత్వం వైఫల్యాలు, మోడీ‌ చేసిన అభివృద్ధి ని‌వివరించేలా ఐదు‌ వేల స్ట్రీట్ కార్నర్ సభలు నిర్వహిస్తున్నాం.పూర్తి మద్య నిషేధం అన్న జగన్.

ఎపిలో మద్యాన్ని పారిస్తున్నారు.పేదలు సంపాదించే ప్రతి రూపాయిని ప్రభుత్వమే దోచుకుంటుంది.

ఎపి లో ఇసుక దొరకక, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు.ఎపి లో మద్యం, గ్రానైట్, కుంభకోణాల్లో ముందంజలో ఉంది కేంద్రం అనేక పధకాలు అమలు చేస్తుంటే.

ఎపి ప్రభుత్వం వాళ్ల స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటుంది.పేదల కోసం ఉచిత బియ్యం ఇస్తే వాటిని కూడా దోపిడీ చేస్తున్నారు.

ఎపిలో అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది.ఆ ప్రాజెక్టు ల నిర్మాణానికి ఎపి ప్రభుత్వం కనీసం భూములు కూడా ఇవ్వడం లేదు,రైల్వే ప్రాజెక్టు లకు కేంద్రం 75శాతం‌ వాటా ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం 25శాతం వాటా కూడా కేటాయించడం లేదు.ఎపిలొ కుటుంబ, కుక,మత పార్టీలను తరిమి కొట్టాలి.

టిడిపి, వైసిపి లు ప్రజలను దోచుకుంటున్నాయి ఎపి లో కూడా బిజెపి ని‌ బలపరచడం వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి జరుగుతుంది.ఈ ప్రజా పోరు యాత్ర లో ప్రజలంతా భాగస్వామ్యం అందించాలి.

బిజె పి నేత ఉప్పలపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ కేంద్రం పేదల కోసం అనేక పధకాలు అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వాటిని పేదలకు అందకుండా సొంత అవసరాలకు మళ్లిస్తుంది.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగున్నట్లుగా జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.

ఎనిమిది లక్షల‌ కోట్లు అప్పులు చేసి ప్రతి మనిషి మీద రెండున్నర లక్షల ఉంచింది.కేంద్రమే విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ లకు నిధులు ఇచ్చింది.

వైసిపి అధికారం లోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు.నీరో చక్రవర్తి తరహాలో జగన్ పాలన సాగుతుంది.

ఆనాడు అసెంబ్లీ సాక్షి గా అమరావతి రాజధాని అని జగన్ చెప్పారు.మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారురైతులు ఇచ్చిన భూములు చెత్త కుప్పలుగా మార్చారు.

రైతుల త్యాగాలను అవహేళన చేస్తున్నారు.హైకోర్టు స్పష్టంగా చెప్పినా రాజకీయ కారణాలతో సుప్రీం కోర్టు కు వెళ్లారుమూడు రాజధానుల పై రెఫరెండం కు వైసిపి సిద్దమా అన్నారు.

ఈ కార్యక్రమానికి జిల్లా బిజెపి అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం అధ్యక్షత వహించారు.అడ్డూరి శ్రీరాం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు రవ్వా హరీష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube