టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ), ఆయన తనయుడు నారా లోకేష్ ( Nara Lokesh )చుట్టూ వైసిపి ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది.ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్టు అయ్యారు.
ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.చంద్రబాబు జైలుకు వెళ్లి అప్పుడే 24 రోజులు అవుతుంది.
ఆయనకు బెయిల్ ఇప్పించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ కాలేకపోతున్నారు.ఈలోపు తనపై సిఐడి నమోదు చేసిన అన్ని కేసులను కొట్టి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫున పిటిషన్ దాఖలు చేశారు .దీనిపై విచారణ జరిగిన తర్వాత , ఈ కేసును తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు.అంటే ఈ కేసు టెన్షన్ మరొక కొద్దిరోజులు కొనసాగునుంది.విచారణలో ఎక్కువ భాగం 17 ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే విషయంపైనే జరిగింది.17 ఏ అంటే గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయవచ్చా లేదా అన్నదే తేల్చే పనిలో ఉన్నారు.

చంద్రబాబును అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదని , ప్రభుత్వం తరఫున లాయర్ ముకుల్ రోహత్గి( mukul rohatgi ) వాదించారు.గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందేనని చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూద్ర , అభిషేక్ వాదించారు.చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి టిడిపి పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంది .ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబును అరెస్టు చేశారని, ప్రజల్లో సానుభూతిని సంపాదించే ప్రయత్నంలో టిడిపి ఉంది.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ పైన ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి.సిఐడి అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో సిఐడి విచారణకు ఈనెల 10వ తేదీన లోకేష్ తప్పకుండా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.అలాగే ముందస్తు బెయిల్ కోసం లోకేష్ పెట్టుకున్న పిటిషన్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

కాకపోతే ఈనెల 10వ తేదీ వరకు లోకేష్ ( Nara Lokesh ను అరెస్టు చేయవద్దని కోర్టు సూచించింది.ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ తో పాటు, ఫైబర్ నెట్ స్కామ్ లోను లోకేష్ పాత్ర ఉందని సిఐడి చెబుతుండడంతో , దానికి సంబంధించిన అన్ని సాక్షాదారాలను సేకరించి పెట్టుకుంది.దీంతో ఈ కేసులో తప్పకుండా లోకేష్ అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.దీంతో తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party ) టెన్షన్ వాతావరణ నెలకొంది.
ఇప్పటికి చంద్రబాబు అరెస్ట్ అయ్యారు.లోకేష్ కూడా అరెస్ట్ అయితే పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే టెన్షన్ టిడిపి నేతల్లో నెలకొంది.
ఒకవైపు చంద్రబాబు భార్య భువనేశ్వరి , లోకేష్ భార్య బ్రాహ్మణి( Brahmani ) చంద్రబాబు అరెస్టు పై నిరసనలు, ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తూ వేడి పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు.లోకేష్ పై కేసులు వంటి విషయాలను పదే పదే ప్రస్తావిస్తూ ప్రజలలోను, పార్టీ శ్రేణులలోను సానుభూతి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక లోకేష్ కూడా అరెస్ట్ అయితే టీడీపీ కష్టకాలం మొదలైనట్టే అన్న అభిప్రాయాలు పార్టీ నాయకులు నుంచి వ్యక్తం అవుతున్నాయి.








