పిల్లలు లేని వారి కోసం రోబోలు వచ్చేశాయి, అవి ఎలా పని చేస్తాయో తెలుసా?

టెక్నాలజీ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రతి అవసరానికి కూడా టెక్నాలజీ వచ్చేసింది.

ఆన్‌ లైన్‌లో ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయి.ప్రతి చిన్నదానికి కూడా ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఇక రోబోలతో సరికొత్త ప్రపంచం ఆవిష్కారం కాబోతుంది.ఇప్పటికే ఉన్న రోబోలకు తోడుగా కొత్త కొత్త రోబోలు తయారు అవుతున్నాయి.

రోబో టెక్నాలజీల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో ప్రపంచం కొత్త పుంతలు తొక్కబోతుంది.

Advertisement

పిల్లలు లేని వారికి ఉండే బాద అంతా ఇంతా కాదు.ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది.పిల్లలు లేని వారు పడే మానసిక వేదనను రోబోలు తీర్చబోతున్నాయట.

టైం పాస్‌ కోసం కొన్ని సార్లు పిల్లలతో ఆడుతూ ఉంటారు.కాని పిల్లలు లేని వారు ఎవరికి టైం పాస్‌ ఎక్కడ నుండి వస్తుంది.

అందుకే వారితో ఆడుకునేందుకు స్పానీష్‌ కంపెనీ అయిన బేబీ క్లాన్‌ ఒక రోబోను తయారు చేసింది.ఆ రోబో అచ్చు 6 నెలల పిల్లాడు ఉన్నట్లుగా ఉంటుంది.

ఆ రోబో ప్రవర్తన అచ్చుగా చిన్న పిల్లల ప్రవర్తన మాదిరిగా ఉంటుంది.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
చూపు లేకపోయినా 4 కిలోమీటర్లు నడిచి గ్రూప్4 జాబ్.. మానస సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

శ్వాస తీసుకోవడం, హార్ట్‌ సంబంధించిన చప్పుడు చేతులు కాళ్లు కదిలించడం ఇలా ప్రతీది కూడా చిన్న పిల్లాడిని పోలి ఉంటుంది.కాస్త అజాగ్రత్తగా చూస్తే ఆ రోబోను నిజంగానే పిల్లాడు అనుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఎంతో టెక్నాలజీతో తయారు చేసిన ఈ బుల్లి రోబోకు 670 డాలర్ల రేటును తయారు చేశారు.

Advertisement

ఈ రోబోలు అమెరికాతో పాటు ఇంకా కొన్ని పాశ్చాత్య దేశాల్లో బాగా ఉపయోగిస్తున్నారట.ఆ రోబో నుండి మామ్‌ అంటూ పిలుపు వస్తున్నప్పుడు ఆ తల్లులు ఆనందంతో ఉపశమనం పొందుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఎంతగా పిల్లల మాదిరిగా ఉంటే మాత్రం రోబోలు పిల్లలు లేని లోటును ఎలా తీర్చుతాయి వారి బొంద అంటూ ఇండియన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

తాజా వార్తలు