బుల్లితెర కార్యక్రమాలలో కమెడియన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ముక్కు అవినాష్ ( Mukku Avinash ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అవినాష్ అనంతరం బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలోకి వెళ్లారు.
ఈ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను తన స్టైల్ లో ఎంటర్టైన్ చేస్తూ మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన స్టార్ మా లో సందడి చేయడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ వస్తున్నారు.
ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అవినాష్ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు ఇక అవినాష్ భార్య అనూజ( Anuja ) గురించి మనకు తెలిసిందే.అనూజా సైతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ అందరిని సందడి చేస్తుంటారు.ఇకపోతే ఈమె కూడా అల్లరి అనూజ అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా వీరికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం అవినాష్ ఓ శుభవార్తను తెలియజేసిన సంగతి తెలిసిందే.
ఇద్దరం కాస్త ముగ్గురం కాబోతున్నాము అంటూ ఈయన తన భార్య ప్రెగ్నెంట్ ( Pregnant )అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు.మూడవ నెల పూర్తి అయ్యేవరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఇన్ని రోజులు దాచామని తాను తండ్రి కాబోతున్నాను అంటూ అందరితో ఈ శుభవార్తను పంచుకున్నారు.అయితే తాజాగా తన భార్య అనూజ సీమంతపు వేడుకలు ( Baby Shower )ఎంతో ఘనంగా జరిగాయని తెలుస్తుంది.ఈ క్రమంలోనే తన భార్యకు జరిగిన సీమంతపు వేడుకకు సంబంధించిన వీడియోని కూడా ఈయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఈమె ఐదవ నెల ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది .ఈ క్రమంలోనే తనకు ఘనంగా సీమంతం నిర్వహించినట్టు తెలుస్తుంది.